Hari Hara Veera Mallu: శ్రీరామనవమి సందర్భంగా ఫ్యాన్స్ కోసం పవర్ స్టార్ పవర్ఫుల్ లుక్.. అదిరింది!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఇక నేడు శ్రీరామనవమి సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

పవర్ఫుల్ కాంబినేషన్

పవర్ఫుల్ కాంబినేషన్

పవన్ కళ్యాణ్ తన కెరీర్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక పిరియాడిక్ హిస్టారికల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాంటి కథను తెర పైకి తీసుకు రావడంలో మంచి అనుభవం ఉన్న దర్శకుడు క్రిష్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఖుషి నిర్మాత ఏఎం రత్నం చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పవర్ఫుల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది అని అర్థం అవుతోంది.

మధ్యలో బ్రేక్

మధ్యలో బ్రేక్

అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ కు మధ్యలో బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. అసలైతే ఈ ఏడాది సంక్రాంతికి హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఒకవైపు కరోనా అలాగే మరొక వైపు పవన్ కళ్యాణ్ మిగతా షూటింగ్స్ అలాగే రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన ఈ సినిమాకు కొంత బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది..

యాక్షన్ సీన్స్ కోసం..

యాక్షన్ సీన్స్ కోసం..

ఇక మొత్తానికి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా మొదలైన షెడ్యూల్లో బిజీ బిజీగా పాల్గొంటున్నాడు. దర్శకుడు క్రిష్ వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

సరికొత్త లుక్

సరికొత్త లుక్

ఇక నేడు శ్రీరామనవమి సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గా కనిపించడంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా సరి కొత్తగా కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

శ్రీరామనవమి పూజలు

శ్రీరామనవమి పూజలు

ఇక శ్రీరామనవమి సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు లోకేషన్ సెట్ లో ప్రత్యేకంగా శ్రీరాముడికి పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ న్యాయం కోసం ధర్మం కోసమే పోరాడే ఒక యోధుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

 విడుదల ఎప్పుడంటే?

విడుదల ఎప్పుడంటే?

హరిహర వీరమల్లు సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేయాలని ఇంతకుముందు అనుకున్న విషయం తెలిసిందే. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో మళ్ళీ ప్లాన్ మొత్తం మారిపోయింది. దీంతో సినిమాను ఈ ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నారు. కుదిరితే దసరా టైమ్ లోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X