HHVM Release Date: సింహం అడుగు వెనక్కి.. బాక్సాఫీస్ పై హరి హర వీర మల్లు పంజా ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి నెక్ట్స్ రాబోతున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండి సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో హరి హర వీరమల్లు చిత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేళలకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను, డబ్బింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేయడంతో ఇంకా విడుదల అవ్వడమే మిగిలి ఉంది. అయితే ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడటం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
హరి హర వీరమల్లు చిత్రం మరోసారి వాయిదా..
హరి హర వీరమల్లు చిత్రం ఇప్పటికే 10 సార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సినిమా వాయిదాల పర్వం కొనసాగుతుండటం గమనార్హం. కాగా రీసెంట్ గా ఈ సినిమాను పక్కాగా జూన్ 12న విడుదల చేస్తామని మేకర్స్ పక్కాగా చెప్పారు. అధికారికంగా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. కానీ తాజాగా మరోసారి సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది.

సింహం ఎంట్రీ ఎప్పుడు?
హరి హర వీమల్లు చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూనే.. మరోవైపు కొత్త రిలీజ్ డేట్ పైనా క్లారిటీ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకులు ఎంతో సహనంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని గ్రాండ్ విజువల్స్ తో చూపించడానికి, ప్రతి షార్ట్ ను అద్భుతంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే మునుపు ప్రకటించిన తేదీకి థియేటర్లలో సినిమాను విడుదల చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ కాస్తా సమయం కోరుతున్నానమని చెప్పారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అతి త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేయబోతున్నామని, ట్రైలర్ తో పాటుగానే కొత్త రిలీజ్ డేట్ వస్తుందని ప్రకటించారు.
రూమర్లను నమ్మొద్దు..
హరి హర వీరమల్లు చిత్రంపై ఎన్నో రూమర్లు పుట్టుకొస్తున్నాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఇష్టరీతినా సినిమా గురించి ఊహాగాహాలను వినిపిస్తున్నారు. కానీ ఎవ్వరూ అలాంటివి నమ్మొద్దని మేకర్స్ కోరారు. అధికారిక సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ద్వారా వచ్చిన సమాచారాన్నే తీసుకోవాలని సూచించారు. ఈ సినిమా కోసం వందల మంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు పని చేస్తున్నారని వారంతా అద్భుతాన్ని చూపించబోతున్నారని హామీనిచ్చారు.
హరి హర వీరమల్లు ఇంట్రెస్టింగ్ విషయాలు..
హరి హర వీరమల్లు చిత్రాన్ని 19వ శతాబ్దంలో సెట్ చేశారు. మొగల్ కాలంలో కోహినూర్ వజ్రాన్ని దొంగలించే కథాంశంతో చిత్రీకరించారు. ఈ చిత్రంలో భారీ యుద్ద సన్నివేశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్టంట్స్ కు అందరూ ఫిదా అవుతారని మేర్స్ హామీనిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











