Hari Hara Veera Mallu Power Glance: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న పవన్ కల్యాణ్ వీడియో..
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ఫ్లాప్‌లు అంటూ తేడా లేకుండా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరో ఎవరైన ఉన్నారంటే అది పవన్ కల్యాణ్ అనే చెప్పవచ్చు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోయే పవన్ కల్యాణ్ కొత్త మూవీ వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే చాలు రచ్చ రచ్చే. ఇక సెప్టెంబర్ 2న విడుదల చేసిన పవన్ కల్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు గ్లాన్స్ వీడియోకు మాములు స్పందన రాలేదు. 24 గంట్లో పది లక్షల మిలియన్ వ్యూస్ సాధించిన ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

ఒక్కొక్కటిగా అప్డేట్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ సినిమా అంటే చాలు ఎక్కడ లేని క్రేజ్ వస్తుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమాపై అంతకుమించి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను ఒక్కొక్కటిగా వదులుతున్నారు.

24 గంటల్లోనే..
సెప్టెంబర్ 2 అంటే శుక్రవారం పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా హరిహర వీరమల్లు నుంచి పవర్ గ్లాన్స్ పేరిట ఒక టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ అద్భుతంగా ఉండి నెటిజన్ల నుంచి అదిరిపోయే టాక్ వస్తుంది. ఎంతలా అంటే హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ విడుదలైన 24 గంటల్లోనే 10 లక్షల వీక్షణలు పొంది రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం యూట్యూబ్‌లో హ్యాష్ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

యూట్యూబ్ షేక్
పవన్ కల్యాణ్ స్టార్‌డమ్‌ను తలపించేలా హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇక టీజర్ విషయానికొస్తే.. గ్లాన్స్ టీజర్ లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తొడగొడుతూ మరి సవాల్ విసరడం వంటి సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.

హైలెట్‌గా కీరవాణి బీజీఎం..
పవన్ కళ్యాణ్ ఇందులో గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త గెటప్ లో కనిపిస్తూ ఉండడం అలాగే మల్లయోధుడిని ఎత్తి అవతలపడేయడం వంటి అంశాలు హైలైట్ అవుతున్నాయి. టీజర్ చూస్తూ ఉంటే సినిమా మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఇక ఈ టీజర్ కు తోడుగా ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది.

ఐకానిక్ ప్రదేశాలకు సంబంధించి..
చారిత్రాత్మక అంశాలు ఈ సినిమాలో చాలా బలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చార్మినార్ గండికోట వంటి ఎన్నో ఐకానిక్ ప్రదేశాలకు సంబంధించిన అంశాలను దర్శకుడు క్రిష్ ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భాగ్యనగరం ప్రతిష్టాపన సమయంలో చోటు చేసుకున్న కొన్ని విభిన్నమైన సంఘటనలు కూడా ఈ సినిమాలో చూపించనున్నారని టాక్.
కెరీర్లో ఇదే తొలిసారి..
పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ మొత్తంలో కూడా ఇప్పటివరకు ఒక చారిత్రాత్మక నేపథ్యంలో సినిమాలు చేసింది లేదు. మొదటిసారి విలక్షణమైన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అలాంటి కథను తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా 2023 సమ్మర్లో విడుదలవుతుంది అని కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు.


Click it and Unblock the Notifications











