గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ అనౌన్డ్స్.. ఎప్పుడంటే?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజా పాలనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, పవన్ కళ్యాణ్ సైన్ చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా? అని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వందకు వందశాతం సీట్లను గెలుచుకొని, తానూ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఇక పవన్ సినిమాల సంగతి అప్పటల్లో ప్రశ్నార్థకంగా మారింది. కానీ తన నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయితే తిరిగి డబ్బులు ఇచ్చేసే పవన్ కళ్యాణ్.. ఇక కోట్లు వెచ్చించి ఏళ్లుగా వేచి ఉన్న నిర్మాతలకు నష్టం రానిస్తారా..? అది తాజాగా మరోసారి రుజువైంది.

అయితే, పవన్ కళ్యాణ్ సైన్ చిత్రాల్లో హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు : పార్ట్ 1' కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ మీదికి వచ్చిన ఐదేళ్లకు దగ్గరగా వస్తోంది. ఈక్రమంలో ఈసినిమా ఎప్పుడూ థియేటర్లలోకి వస్తుందా? అని ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. పవన్ కళ్యాణ్ తిరిగి రాజకీయాల్లో బిజీ కావడంతో ఇంకా ఆలస్యం అవుతుందని భావించారు. కానీ రీసెంట్ గానే పవన్ షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటుడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. ఇక హోలీ2025 సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా నిర్మాతలు ఫైనల్ చేసి, అనౌన్స్ చేశారు.

Pawan Kalyan Hari Hara Veera Mallu Release Date Locked When this film is going to Release

'ధర్మ యుద్ధం మొదలైంది - హరి హర వీర మల్లు 2025 మే 9న విడుదలవుతోంది' అంటూ పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది రాబోతున్న ఇండియన్ చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' భారీ చిత్రంగా నిలుస్తుందని ఆశించారు. ఈ చిత్రం మార్చి 29నే థియేటర్లలోకి రావాల్సిన ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నందున రిలీజ్ డేట్ ను కాస్తా పోస్ట్ పోన్ చేశారు. తాజాగా మరో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్నదని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండటం విశేషం.

'హరిహర వీరమల్లు' చిత్రం కథ మొఘల్ కాలంలో కొనసాగుతుంది. మొఘల్స్ నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగలిచ్చే పనికి వీరమల్లు నియమితులైతారు. కాగా ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్లు, యుద్ధ సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే నిర్మాతలు సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. మరోవైపు ఒక్కొక్కటిగా అందుతున్న అప్టేట్స్ కు భారీ హైప్ నెలకొంది. పవన్ నుంచి ఇదే మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ కూడా కాబోతుండటంతో ఫ్యాన్స్, అభిమానులు ఎంతో ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో మరింతగా అంచనాలు ఉన్నాయి.

Pawan Kalyan Hari Hara Veera Mallu Release Date Locked When this film is going to Release

హరి హర వీర మల్లు భారీ స్థాయిలోనే ఓవర్సీస్ ఓపెనింగ్‌ను సాధించిందని కూడా చెప్పారు. ఇక ఈ చిత్రానికి మొదట్లో క్రిష్ దర్శకత్వవం వహించారు. ఆ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ ఎంట్రీతో వెంటనే పూర్తి చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. మనోజ్ పరమహంస ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా అలరించబోతున్నారు. అనసూయ, పూజిత పొన్నాడ స్పెషల్ అప్పీయరెన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత ఏఎం రత్నం సమర్పించగా.. ఏ దయాకర్ రావు గ్రాండ్ గా నిర్మించారు.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X