Hari Hara Veera Mallu: దర్శకుడితో పవన్ కళ్యాణ్ స్ట్రిప్ట్ రీడింగ్.. ఆ రూమర్లకు చెక్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటారని అని ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో మరోసారి రుజువైంది. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక భవిష్యత్తులో రాబోయే సినిమాల కలెక్షన్స్ కూడా అంతకు మించి అనేలా ఉంటాయి అని అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెట్ చేసుకున్న ప్రాజెక్టులు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.
ఇక ఇటీవల హరిహర వీరమళ్లు కోసం దర్శకుడితో కలిసి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్క్రిప్టు చదువుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చారిత్రాత్మక అంశాలతో సినిమాను చాలా ఉన్నతంగా తెరపైకి తీసుకు రాగల దర్శకుడు క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదటి సారి వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే క్రిష్ నందమూరి బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమాను తెరపైకి తీసుకు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరొక చారిత్రాత్మక అంశంతో సరికొత్త కథను తెర పైకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

హరిహర వీరమల్లు అనే టైటిల్ కూడా సినిమాకు సెట్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి పిరియాడిక్ డ్రామా లో అసలు నటించలేదు. ఈ సినిమాలో పదహారు వందల శతాబ్దంనాటి అంశాలను కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గండికోట రహస్యం కి సంబంధించిన అంశాలు కూడా ప్రేక్షకులను చాలా ఆసక్తిని కలిగిస్తాయని ఇదివరకే చిత్ర యూనిట్ ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది.
సినిమా కోసం నిర్మాత ఎ.ఎం.రత్నం ఇప్పటికే రెండు భారీ సెట్స్ కూడా నిర్మించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్స్ కోసం వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నారు. ఇక ఇటీవల మరొకసారి దర్శకుడితో కలిసి తదుపరి షెడ్యూల్ కోసం స్క్రిప్ట్ పై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ తో ప్రత్యేకంగా ఒక ఫోటోను కూడా తీసుకున్నాడు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా దర్శకుడు క్రిష్ మరొక షెడ్యూల్ ను న్యూ ఇయర్ సందర్భంగా కొత్త సంవత్సరం మొదలు పెట్టనున్నట్లు వివరణ ఇచ్చారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అసలైతే ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితుల ప్రభావం వలన సినిమాను మళ్ళీ వాయిదా వేయక తప్పలేదు. వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం హరిహర వీరమల్లు పాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమకంటే ముందు పవన్ సంక్రాంతికి భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











