HHVM Ticket Price: హరి హర వీరమల్లు టికెట్ ధరలు.. ఎంత పెరిగిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి ఎప్పుడు వెండితెరపై కనిపిస్తారా? అని అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. సినిమాల నుంచి రాజకీయాల వైపు అడుగులేసిన పవన్ కళ్యాణ్, 2018 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతటి ప్రభంజనం సృషించారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సంచలనం తర్వాత వెండితెరపై పవనుడిని చూసేందుకు ఎంతగానో ఆసక్తితో ఉన్నారు. ఇక 4 రోజుల్లో వారి కోరిక తీరబోతోంది. ఈ సందర్బంగా హరి హర వీరమల్లు చిత్రం టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఆ వివరాల్లోకి వెళితే..
5 ఏళ్లుగా ఎదురు చూపులు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ముందుగా హరి హర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. 2020లోనే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఊహించని పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటి వరకు 13 సార్లు వాయిదా పడి రికార్డ్ క్రియేట్ చేసింది. అయినా కూడా హరి హర వీరమల్లు సినిమాపై ఏమాత్రం హైప్ తగ్గకపోవడం విశేషం. 5 ఏళ్లుగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎట్టకేళలకు 4 రోజుల్లో ఆ కల నెరవేరనుంది.

హరి హర వీరమల్లు టికెట్ ధరలు..
ఎట్టకేలకు పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం విడుదల తేదీ దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలో గ్రాండ్ రిలీజ్ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. కాగా తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో వెసులుబాటు కల్పించింది. జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా హరి హర వీరమల్లు చిత్రం విడుదల కాబోతుంది. ఇక 23న ఏపీలో ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే ధరలు కూడా పెంచుతూ గుడ్ న్యూస్ చెప్పింది.
జూలై 23న ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చింది. ప్రీమియర్స్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.600లుగా నిర్ణయించారు. ఆపై జీఎస్టీ అదనం. రాత్రి 9:00 గంటలకు ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు. మరోవైపు 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ల ధరలను కూడా పెంచారు. లోయర్ క్లాస్ లో రూ.100, అప్పర్ క్లాస్ లో రూ.150, మల్టీ ప్లెక్స్ లో రూ.200 వరకు టికెట్ ఛార్జీలను పెంచుకునే అవకావం కల్పించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్..
సినిమా రిలీజ్ కంటే ముందు ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొనింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా రాబోతున్నారని నిర్మాత తెలిపారు. జూలై 21న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఇక ఈ చిత్రానికి ఏఎం రత్నం రూ.250 కోట్ల వరకు ఖర్చు చేశారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్, బాబీ డియోల్ విలన్, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications