Pawan Kalyan: క్రేజీ అప్డేట్.. ఆ పండుగ కానుకగా హరి హర వీరమల్లు.. టీజర్ ఎప్పుడంటే?

'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి తెరగేంట్రం చేసిన పవన్ కల్యాణ్.. తనదైన శైలీలో నటిస్తూ అశేషమైన అభిమానులను సంపాదించుకుని ప్రత్యేకమైన స్టార్ డమ్ సాధించుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఉన్నది ఫ్యాన్స్ కాదు భక్తులు అనే స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో కానీ, తెలుగు ప్రేక్షకుల్లో కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గదు. సినిమాలు డిజాస్టర్ అయినా స్టార్ డమ్ కొంచెం కూడా చెక్కు చెదరని హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ఇక ఆయన నుంచి వస్తున్న తాజా సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నవారందరికీ అదిరిపోయే న్యూస్ ఇది.

కొత్త సినిమా వస్తుందంటే..

కొత్త సినిమా వస్తుందంటే..


తెలుగు ప్రజల్లో పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్​లు ఫ్లాప్​లు అంటూ తేడా లేకుండా ఎలాంటి క్రేజ్​ తగ్గని హీరో ఎవరైన ఉన్నారంటే అది పవన్​ కల్యాణ్​ అనే చెప్పవచ్చు. సినిమా సినిమాకు క్రేజ్​ పెంచుకుంటూ పోయే పవన్​ కల్యాణ్​ కొత్త మూవీ వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. ఇటీవల పవన్ కల్యాణ్.. వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతోపాటు అన్ స్టాపబుల్ 2 షో ద్వారా డిజిటల్ తెరపై కూడా అలరించారు పవన్ కల్యాణ్.

కీలకమైన యుద్ధ సన్నివేశాలు..

కీలకమైన యుద్ధ సన్నివేశాలు..

ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో తాజాగా రానున్న చిత్రం హరిహర వీరమల్లు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో (సుమారు రూ. 180 కోట్లు) నిర్మిస్తున్నారు. ఇది పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా అని టాక్. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న హరిహర వీరమల్లు చిత్రీకరణ ఇప్పటికే 60 శాతానికిపైగా పూర్తయింది. ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా కీలకమైన యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు.

పుట్టినరోజు సందర్భంగా..

పుట్టినరోజు సందర్భంగా..

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ కానున్నట్లు సమాచారం. బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. అందుకు తగినట్లుగానే ఇటీవల షూటింగ్ స్పాట్స్ నుంచి నిర్మాత పుట్టినరోజు సందర్భంగా పంచుకున్న ఫొటోల్లో ఆయన గెటప్ ఉన్నట్లు తెలుస్తోంది.

 మొదటి పార్టును ఈ ఏడాది..

మొదటి పార్టును ఈ ఏడాది..

పవన్ కల్యాణ్ షేర్ చేసిన ఆ ఫొటోల్లో ఆయన గెటప్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అందులో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో కనిపించిన పవన్ కల్యాణ్ నవ్వుతూ దర్శనమిచ్చారు. పవన్ కల్యాణ్ నవ్వుకి మెగా ఫ్యాన్స ఫిదా అయ్యారు. ఇక ఔరంగజేబు కాలం నాటి కథతో వస్తున్న హరి హర వీరమల్లు సినిమాను రెండు పార్టులుగా తీస్తున్నట్లు టాక్. ఇందులో మొదటి పార్టును ఈ ఏడాది విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 దసరా బరిలో పవన్ కల్యాణ్..

దసరా బరిలో పవన్ కల్యాణ్..


పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు మొదటి పార్టును ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అలాగే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగానే టీజర్ ను రిలీజ్ చేసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నారట. సో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా హరి హర వీరమల్లు మొదటి పార్టును ఈ ఏడాది దసరా బరిలో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో పార్టును వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారని టాక్.

 మరో మూడు చిత్రాలు..

మరో మూడు చిత్రాలు..

ఇదిలా ఉంటే ఈ సినిమానే కాకుండా పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చిత్రీకరణ ప్రారంభించేదుక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు సాయి ధరమ్ తేజ్ హీరోగా, పవన్ ప్రత్యేక పాత్రలో నటించనున్న తమిళ హిట్ మూవీ వినోదయ సీతం రీమేక్ కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారట. డీవీవీ దానయ్య నిర్మాతగా సుజీత్ దర్శకత్వంలో OG సినిమా షూటింగ్ తర్వరలో ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X