పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ మూవీ అప్‌డేట్: షురూ అయ్యేది అప్పటి నుంచేనట

రీఎంట్రీలో ఫుల్ స్పీడుతో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'అజ్ఞాతవాసి' తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయిన ఆయన.. చాలా కాలం తర్వాత 'వకీల్ సాబ్' అనే మూవీతో కమ్‌బ్యాక్ అవుతున్నాడు. ఈ సినిమా పట్టాలపై ఉండగానే క్రిష్ జాగర్లమూడితోనూ, హరీశ్ శంకర్‌తోనూ సినిమాలను ప్రకటించాడు. ఆ తర్వాత 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ ప్రకటించి.. దాన్ని వెంటనే ప్రారంభించాడు. ఈ సినిమాల షూటింగ్‌లు ఒక్కొక్కటిగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ కొత్త సినిమా అప్‌డేట్ వచ్చింది.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీశ్ శంకర్‌తో పవన్ కల్యాణ్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఇది ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో క్రేజీ కాంబోపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జూన్ మొదటి వారంలో జరపబోతున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని రెండో వారం కానీ, మూడో వారం నుంచి కానీ రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తోంది. అప్పటి నుంచి ఏకధాటిగా చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది.

 Pawan Kalyan - Harish Shankar Movie Shoot Update

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. PSPK28గా ఇది రూపొందనుంది. ఈ మూవీ టైటిల్, నటీనటుల విషయంలో ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నా.. ఏదీ ఫిక్స్ చేయలేదని చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితమే వెల్లడించింది. ఇదిలా ఉండగా.. వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఆ తర్వాత క్రిష్ తెరకెక్కిస్తోన్న సినిమాకు 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ రెండింటితో పాటు సాగర్ కే చంద్ర రూపొందిస్తోన్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' శరవేగంగా షూట్ జరుపుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X