Pawan Kalyan: ఈసారి పర్ఫామెన్స్ బద్ధలైపోద్ది.. విజిల్స్ వేయించే పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు చిత్రసీమలోకి తెరగేంట్రం చేసిన పవన్ కల్యాణ్.. తనదైన శైలీలో నటిస్తూ అశేషమైన అభిమానులను సంపాదించుకుని ప్రత్యేకమైన స్టార్ డమ్ సాధించుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఉన్నది ఫ్యాన్స్ కాదు భక్తులు అనే స్థాయికి ఎదిగారు.

రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో కానీ, తెలుగు ప్రేక్షకుల్లో కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గదు. ప్రస్తుతం ఆయన వరుసపెట్టి సినిమాలు చేయగా అందులోని ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గ్లింప్స్ వీడియోను తాజాగా విడుదల చేసి అభిమానులకు ట్రీట్ అందించారు.

OG Pawan Kalyan Still

పవన్ చిత్రాలు: పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాను పవన్ కల్యాణ్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా విడుదలయ్యే ఈ సినిమా కాకుండా యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) సినిమా కూడా చేస్తున్నారు. అలాగే వినోదయ సీతం అనే రీమేక్ మూవీలో కూడా పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.

Ustaad Bhagat Singh Movie Glimpse

11 ఏళ్ల క్రితం: ఈ చిత్రాలే కాకుండా పవన్ కల్యాణ్ చేస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు కారణం ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమానే. 11 ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. అప్పటి వరకు వరుసగా డిజాస్టర్స్ అందుకున్న పవన్ కు అంతకుమించి స్టార్ డమ్ తీసుకొచ్చింది.

Ustaad Bhagat Singh Movie Glimpse

ఆ సందర్భంగా: గబ్బర్ సింగ్ వంటి మాస్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకు తగినట్లుగానే రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మూవీలోని వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గబ్బర్ సింగ్ మూవీ వచ్చి 11 ఏళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్ లో అభిమానుల కోలాహలం మధ్య గ్లింప్స్ ను లాంచ్ చేశారు.

Ustaad Bhagat Singh Movie Glimpse

42 సెకన్ల నిడివి: సుమారు 42 సెకన్ల నిడివి ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో గ్లింప్స్ అదిరిపోయింది. ధర్మం తప్పినప్పుడు ప్రతి యుగంలో అవతారం గావిస్తున్నాడు అంటూ భగవద్గీత మాటలతో గ్లింప్స్ మొదలు పెట్టి భగత్ సింగ్ అని పవన్ కల్యాణ్ ను చూపించారు. లుంగీ కట్టుకుని, వెనుక సైడ్ గన్ పెట్టుకుని పవన్ కల్యాణ్ నడవడం మాసీగా ఉంది. మరోసారి తనదైన మ్యానరిజంతో అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు గ్లింప్స్ చూస్తుంటే తెలిసిపోతుంది.

విజిల్స్ కొట్టించే: పోలీస్ డ్రెస్ వేసుకుని చేతిలో టీ గ్లాస్ తో ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోతుంది అని పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ విజిల్స్ కొట్టేలా చేసింది. ఇదిలా ఉంటే వీడియో గ్లింప్స్ లాంచ్ చేసే సమయంలో అభిమానులు సీఎం.. సీఎం అంటూ అరుస్తూ, విజిల్స్ వేస్తూ గోల చేశారు. కాగా ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేనీ, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X