ఉస్తాద్ భగత్ సింగ్ కథ మారింది.. ఏఏ అంశాలు మార్చేశారో తెలుసా?

పవర్ స్టార్ తన ఒక్కో చిత్రాన్ని వరుసగా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. తన లైనప్ లో ఉన్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంటున్నారు. తనను నమ్ముకున్న దర్శకులు, నిర్మాతలకు తగిన సమయం ఇస్తున్నారు. ఎవరూ నష్టపోకూడదని సినిమా షూటింగ్ లకు రెగ్యులర్ గా హాజరవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత తన సినిమాల కథలను కూడా మార్చేస్తున్నారు. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర కథను పూర్తిగా మార్చేశారని తెలుస్తోంది. అందుకు కారణం కూడా ఉందని అంటున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

2023లోనే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రారంభం..
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు 2023లోనే ప్రారంభించారు. మొదట్లో ఈ చిత్రానికి సంబంధించిన 15 రోజుల షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మరో షెడ్యూల్ కూడా జరిగింది. ఇక ఆ తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024లో బిజీ అయ్యి పోయారు. దీంతో పవన్ కళ్యాణ్ సైన్ చేసిన అన్ని చిత్రాలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కూడా ఆలస్యం అవుతూనే వచ్చింది. ఎట్టకేళలకు జూన్ 10న మళ్లీ ప్రారంభమైంది.

Pawan Kalyan Harish Shankar Ustaad Bhagat Singh Movie Story Changed

ఉస్తాద్ భగత్ సింగ్ కథలో మార్పులు..
ఎట్టకేళలకు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ అందింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కథను పూర్తిగా మార్చేశారంట. పవన్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రజలకు, అక్కడి నాయకులు, ఏ వర్గానికి సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్ లు, మాటలు, పాటలు ఇబ్బంది కలిగించ కూడదని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కథలో భారీ మార్పులు చేశారంట మేకర్స్. ఆ తర్వాత షూటింగ్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఏఏ అంశాలను మార్చారంటే..
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే షూట్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అప్పుడు ఎన్నికల పరిస్థితులకు తగ్గట్టుగా, పొలిటికల్ సైటైర్లతో సినిమా కథను మలిచారు. ప్రజల్లోనూ పవన్ కళ్యాణ్ చెప్పాలనుకునే కీలకమైన అంశాలను ఆ చిత్రం ద్వారా తీసుకు వెళ్లాలని అనుకున్నారంట. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో అప్పటి కథను పూర్తిగా మార్చేయాల్సి వచ్చిందని సినీప్రముఖులు అంటున్నారు. పొలిటికల్ సీన్లు, డైలాగ్స్, కొన్ని ఎన్నికలకు సంబంధించిన సీన్లను తొలగించి, ఇంట్రెస్టింగ్ సీన్లను జోడించారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ యంగ్ లుక్ తో రచ్చ..
పవన్ కళ్యాణ్ తన రాబోయే చిత్రాలతో దుమ్ములేప బోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన అభిమానులకు యంగ్ లుక్ తో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. తమ్ముడు, ఖుషి రోజులను గుర్తుచేసే ప్రయత్నం చేయబోతున్నారు. ముందుగా హరి హర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓజీ చిత్రం సెప్టెంబర్ 25, 2025న విడుదల కానుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని 2026 సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X