ఎంత ఎదిగినా మూలాలు మరువొద్దు.. అల్లు అర్జున్‌కు పవన్ కల్యాణ్ కౌంటర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్, దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్,కియారా అద్వానీ, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో జనవరి 4వ తేదీన శనివారం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. పత్రికా అధిపతులకు, మీడియా ప్రతినిధులకు, అలాగే ఈవెంట్‌ను వీక్షిస్తున్న ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. అలానే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నమస్కారాలు అంటూ నవ్వుల్లో మునిగిపోయారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరిచిపోకూడదు. తెలుగు సినిమా పరిశ్రమకు మూలాలైనా రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా సాహెబ్ ఫాల్కే, రాజ్ కపూర్, సత్య జిత్ రేని మర్చిపోలేం, తెలుగు ఖ్యాతిని ఎగరేసిన నాగిరెడ్డి గారిని, బీఎన్ రెడ్డి గారిని, రామబ్రహ్మం గారు, తెలుగు జాతి కీర్తి పెంచిన ఎన్టీ రామారావు గారిని, ఏఎన్నార్ గారిని తలుచుకుంటాం అని పవన్ కల్యాణ్ అన్నారు.

పవన్ కల్యాణ్ అన్నా.. మీరు ఓజీ అన్నా.. ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఉన్నా.. దానికి కారణం చిరంజీవి గారు. మీరు కళ్యాణ్ బాబు అని అరిచినా, ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అని అరిచినా దానికి చిరంజీవి గారే ఆద్యులు. మొగల్తూరులో పుట్టి మెగాస్టార్ చిరంజీవి ఎదగడం వల్లే మేము ఇక్కడ ఉన్నాం అని ఎమోషనల్ అయ్యారు.
నాకు చిరంజీవి పితృసమానులు. నేను రామ్ చరణ్‌కు బాబాయ్‌లా ఉండను. రామ్ చరణ్ నాకు సోదర సమానుడు. రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. గోదారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే.. అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఆయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను అని అన్నారు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రాంచరణ్ అద్బుతంగా నటించాడు. గోదావరి తీర ప్రాంతంలో పుట్టి పెరగకపోయినా.. ఇక్కడి సంస్కృతిని అర్ధం చేసుకొని బాగా నటించారు. ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని అనుకొన్నాను. కానీ రాలేదు. అయితే భవిష్యత్‌లో ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని అనుకొంటున్నాను. తండ్రి మెగాస్టార్ అయితే.. కొడుకు గ్లోబల్ స్టార్ అవ్వడా? అని అన్నాడు. ఎంత ఒదిగినా తన మూలాలు మరిచిపోడు. చిరంజీవీ వల్లే మేమంతా ఇక్కడ నిలబడ్డాం. మేము ఎప్పుడూ చిరంజీవి ప్రసాదించిన జీవితాన్ని మరిచిపోమని అన్నారు. అయితే పరోక్షంగా అల్లు అర్జున్‌ను విమర్శించారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ రాజమండ్రిలో నిర్వహించడానికి సహకరించిన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు. ఆయన సహకారం, మద్దతు వల్లే ఈ రోజు ఇక్కడ ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించుకోగల్గుతున్నాం. హోం మినిస్టర్ అనిత గారికి, డీజీపీ గారికి, జిల్లా యంత్రాంగానికి థాంక్స్. ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు నమస్కారాలు అని అన్నారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ గారు, ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, ఎమ్మెల్యే బత్తుల బలరాం గారు, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ గారు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు, కుడా చైర్మన్ తుమ్మల బాబు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











