For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రివ్యూ మీటింగులో అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన పవన్ కళ్యాణ్!

|
Pawan Kalyan Asks His Fans To Not Believe In Media Rumors || Filmibeat Telugu

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. త్వరలో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అందరి దృష్టి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అని మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎదురు చూసేది కేవలం ఎన్నికల ఫలితాల కోసం మాత్రమే కాదు... పవర్ స్టార్ నుంచి తీయని కబురు వస్తుందని వారు వేయి కళ్లతో వేచిఉన్నారు.

ఎన్నికల తర్వాత పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన గతంలోనే కొందరు నిర్మాతలకు సినిమాలు చేస్తానని కమిట్మెంట్స్ ఇచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని ఫుల్‌ఫిల్ చేస్తారంటూ ఫిల్మ్ నగర్లో చర్చ సాగుతోంది.

గతంలో ప్రయత్నాలు జరిగిన మాట నిజమే కానీ...

‘గోపాల గోపాల' ఫేం డైరెక్టర్ డాలీతో మరో సినిమా చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. నిర్మాత రామ్ తాళ్లూరి ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదు అనేది పవన్ సన్నిహితుల వాదన. గతంలో సినిమా ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమే... కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఆ ప్రయత్నం విరమించుకున్నారని స్పష్టం చేస్తున్నారు.

నాగబాబు సైతం క్లారిటీ ఇచ్చారు

పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ బాబు సైతం ఇటీవల ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడంపై క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ బాబుకు మళ్లీ సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన తమ్ముడిని రాజకీయాల్లో అన్ పాపులర్ చేయడానికే ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఎవరెన్ని చెప్పినా అభిమానుల్లో ఏదో చిన్న ఆశ

స్వయంగా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి... జనసేన పార్టీ శ్రేణులు కానీ, నాగబాబు చెప్పిన విషయాలు కానీ అభిమానుల చెవికెక్కడం లేదు. పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి తిరిగి వస్తారనే ఆశ అలాగే ఉండి పోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేస్తారనే నమ్మకంతో చాలా మందిలో బలంగా నాటుకుపోయింది.

రివ్యూ మీటింగులో అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన పవన్ కళ్యాణ్!

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తన సినిమా రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఆదివారం గుంటూరు జరిగిన జనసేన రివ్యూ మీటింగులో మాట్లాడుతూ... రాబోయే 25 ఏళ్లలో రాజకీయాల్లో సమూల మార్పులు తేవడమే జనసేన లక్ష్యమని తెలిపారు. తాను రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను అభిమానులు, జనసేన సానుభూతి పరులు నమ్మవద్దని స్పష్టం చేశారు.

సినిమాల వైపు వచ్చే మూడ్ లేనట్లేనా?

పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూస్తుంటే ఆయనకు సినిమాల్లో వచ్చే ఆలోచన ఏ మాత్రం లేదని స్పష్టమవుతోంది. మళ్లీ ముఖానికి రంగేసుకుంటే ఇతర పార్టీల వారు విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని, ప్రజల్లోనూ తనపై నమ్మకం తగ్గుతుందనే ఉద్దేశ్యంతో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Powerstar Pawan Kalyan asked his fans to not believe in media rumors about him taking a break from politics after the counting. Well, it looks like Pawan is in no mood to act in movies again in near future.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more