పవన్ కళ్యాణ్ స్పెషల్ డైట్.. దెబ్బకు 10కేజీలు తగ్గాడు.. ఏం తింటున్నారో తెలుసా?
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే రెండు చిత్రాలకు సంబంధించిన తన పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన సినిమాలకు టైమ్ కేటాయించి షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయబోతున్నారు. అయితే ఈ రెగ్యులర్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన డైట్ ను ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. దాని వల్లనే పవర్ స్టార్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గారంట. రీసెంట్ గా ఆయన స్లిమ్ ఫిట్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారనే వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఫోకస్ మొత్తం షూటింగ్స్ పైనే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఎన్నికలు, ప్రజా పాలనపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇక కొన్నిరోజుల నుంచి తను నమ్ముకొని కోట్లు పెట్టుబడితో సినిమాలను ప్రారంభించిన నిర్మాతలు, దర్శకులకు సమయం ఇస్తున్నారు. తన లైనప్ లో ఉన్న చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి డబ్బింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేశారు. నెక్ట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ పెట్టారు.

షూటింగ్స్ కోసం పవన్ స్పెషల్ డైట్..
తన సినిమాల షూటింగ్ కోసమని పవన్ కళ్యాణ్ స్పెషల్ డైట్ ను ఫాలో అవుతున్నారంట. దాంతోనే 10 కిలోల వెయిట్ తగ్గారు. ఇటీవల సెలూన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఫిట్ గా కనిపించారు. అయితే పవన్ కళ్యాణ్ రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నారంట.ఇక మార్నింగ్, ఈవెంనింగ్, మధ్యలో ఫ్రూట్స్, డ్రింక్స్ మాత్రమే తీసుకుంటున్నారంట. అలాగే ఎక్సర్ సైజ్ లు కూడా చేస్తూ ఉన్నారంట.అయితే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ కు కారణం వన్ మీల్ ను ఫాలో అవ్వడమే అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన తమ్ముడు, ఖుషి లుక్ ను తిరిగి పొందడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో పవన్..
పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉండటంతో అసలు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఉంటుందో లేదో అనే సందేహం అందరిలో కలిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనను నమ్ముకున్న డైరెక్టర్ హరీశ్ శంకర్ కు హామీనిచ్చాడు. మాట ప్రకారమే జూన్ 12 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు హాజరవుతున్నారు. వరుసా 30 రోజుల పాటు ఈ చిత్ర షూటింగ్ కొనసాగనుంది. దాంతో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని తెలుస్తోంది. 2026 సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ప్లాన్..
నటుడిగా పవన్ కళ్యాణ్ అందనంత ఎత్తుకు చేరుకున్నారు. ఇక రాజకీయంగా కూడా జనసేన పార్టీతో ప్రభంజనం సృష్టించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు మానేస్తారా? అనే చర్చ కొనసాగుతోంది. కానీ ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు ప్రధాన ఆదాయ వనరు సినిమానే కావడంతో ఆ అవకాశం లేదని ప్రముఖులు అంటున్నారు. మున్ముందు సినిమాలూ చేస్తారని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











