We Love Kalyan Babu.. ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ హంగామా.. టాప్ ట్రెండింగ్ కారణం ఏమిటంటే..

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌తో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చి రచ్చ చేశారు. ఒక రీమేక్ సినిమాతో అత్యధిక కలెక్షన్లను పవన్ కల్యాణ్ వసూలు చేయడం దేశవ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ రేంజ్ మరోసారి ఏదో రుజువైంది.

ఇలాంటి సంచలన పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కరోనావైరస్ పాజిటివ్ బారిన పడటం అభిమానులను కుంగదీసింది. అయితే కరోనాను ధీటుగా ఎదురించి బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ గురించి ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. #WeLoveKalyanBabu అంటూ ఫ్యాన్స్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ చేయడం క్రేజీగా మారింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే 21.5k ట్వీట్లతో మోత మోగిస్తున్నారు.

 Pawan Kalyan is top trending in twitter with WeLoveKalyanBabu

ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలు వరుసగా క్యూ కట్టాయి. దాదాపు ఐదు, ఆరు సినిమాలను లైన్‌లో పెట్టారు.

#PSPK27 గా సాగర్ దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌లో రానాతో కలిసి పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.

#PSPK28 గా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతున్నది.

#PSPK29 గా హరీశంకర్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.

#PSPK30 గా దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాతగా రాంచరణ్ కాంబినేషన్‌లో పవన్ కల్యాణ్ మరో సినిమా షూటింగుకు సిద్ధమైంది.

#PSPK31 గా బండ్ల గణేష్‌తో పవన్ ఓ సినిమా..

అలాగే #PSPK32 గా నిర్మాతలు జే భగవాన్, పుల్లారావు రూపొందించే చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X