twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జనతా కర్ఫ్యూ.. సెలెబ్రిటీల కరతాళధ్వనులు.. రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వీడియోలు వైరల్

    |

    దేశ ప్రధాని నరేంద్ర మోడి ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను దేశం అంతా పాటిస్తోంది. కర్ఫ్యూలో భాగంగా ఐదు గంటలకు బాల్కనీలోకి వచ్చి కరతాళధ్వనులు చేయాలని, గంటలు కొట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. భయంకరమైన కరోనా వైరస్‌ను ఎదుర్కొంటూ వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు గుర్తుగా కరతాళధ్వనులు చేశారు. టాలీవుడ్ ప్రముఖులందరూ బయటకు వచ్చి గంటలు, కరతాళధ్వనులు కొట్టారు.

    జనతా కర్ఫ్యూ..

    కరోనా ఒకరిని నుంచి మరొకరికి సోకుతుండటంతో ఈ గొలుసును అరికట్టేందుకు పద్నాలుగు గంటలపాట స్వీయ నిర్భందం విధించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చాడు. వైరస్ జీవిత కాలం పన్నెండు గంటలే కావడంతో.. పద్నాలుగు గంటలు ఇంటి పట్టునే ఉంటే.. కరోనాను నియంత్రించే అవకాశం ఉందని దేశ ప్రజలకు సూచించాడు.

    ఐదుగంటలకు బాల్కనీలో..

    అదే విధంగా మనకు సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని స్మరించుకుని, గౌరవించుకునే క్రమంలో అందరూ ఐదు గంటలకు కరతాళ ధ్వనులు చేయాలని పేర్కొన్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖులందరూ కరతాళ ధ్వనులు, గంటలు కొట్టి వైద్య సిబ్బందిని గౌరవించారు.

    గంటకొట్టిన జనసేనాని..

    పవన్ కళ్యాణ్ జనతా కర్ఫ్యూకు మద్దతిస్తూ..ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాను జనతా కర్ఫ్యూకు మద్దతిస్తున్నానని, ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అందరూ ఐదు గంటలకు చప్పట్లు కొట్టాలని తెలిపాడు. తాను కూడా అలాగే చేస్తానని చెప్పగా.. ప్రస్తుతం తాను గంట కొట్టిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.

    Recommended Video

    Actor Sapthagiri Exclusive Interview With Filmibeat Telugu || Vajra Kavachadhara Govinda
    ఎన్టీఆర్, రామ్ చరణ్..

    ఎన్టీఆర్, రామ్ చరణ్..

    ఆర్ఆర్ఆర్ టీమ్ ముందు నుంచీ కరోనా పట్ల అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఓ వీడియో రూపంలో తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్‌తో కలిసి గంట కొట్టగా.. రామ్ చరణ్ బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టాడు. మంచు మనోజ్, ఛార్మీ వంటివారు కూడా చప్పట్లు కొట్టిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

    English summary
    Janta Curfew become Success. In The Process Of Janta Curfew Pawan Kalyan Jr NTR Ring Bell And Ram Charan Clapped.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X