twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా కోసం ప్లేట్లు కడిగా...హీరో అవ్వడమే టార్గెట్ : పవన్ సూపర్ హిట్ సినిమా దర్శకుడు

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు తక్కువే అయినా, ఆయనకు ఎనలేని క్రేజ్ ఏర్పడింది. నిజానికి ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. అలాంటి ట్రెండ్ సెట్ చేసిన ఆయన సినిమాలలో ఖుషీ సినిమా ఒకటి. ఈ సినిమా ద్వారా పవన్ కల్యాణ్‌కు యూత్‌లో క్రేజ్ ఏర్పడింది. ఆయన సినీ చరిత్రలో ఒక స్పెషల్ మూవీగా నిలిచింది. ఈ సినిమా రిలీజై నిన్నటికి 20 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు ఎస్జే సూర్య పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.

    స్విమ్ సూట్‌లో క్లీవేజ్ షోతో‌ సెగలు రేపుతోన్న పార్వతి నాయర్

    20 ఏళ్ళ ఖుషీ

    20 ఏళ్ళ ఖుషీ

    పవన్ కళ్యాణ్ - భూమిక జంటగా నటించిన ఈ సినిమాకు ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. పవన్ తో పోటాపోటీగా నటించిన భూమిక కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీ సూర్య మూవీస్ పై ఏ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మించారు. అయితే తమిళంలో విజయ్ నటించిన ఖుషీ అనే సినిమాకి అదే పేరుతొ తెలుగులో రీమేక్ గా తీశారు.

     పవన్ తలొగ్గాడు

    పవన్ తలొగ్గాడు

    ఖుషి సినిమా మొదట తమిళంలో తీసినా, విజయ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ కు కధ చెప్పాడట దర్శకుడు. కానీ అప్పుడు వేరే సినిమాల కారణంగా పవన్ బిజీగా ఉండడం వల్ల ముందు తమిళ్ లో చేశారట. అయితే కధ చెప్పినప్పుడే తన తరువాతి సినిమా చేస్తానని మాటిచ్చిన పవన్ అలానే చేశాడట. బద్రి లాంటి సినిమా తర్వాత ఖుషి లాంటి కథ రిస్క్ అని తెలిసినా డైరెక్టర్, కధ మీద ఉంచిన నమ్మకానికి పవన్ తలొగ్గాడు.

    సూపర్ డూపర్ హిట్

    సూపర్ డూపర్ హిట్

    ఖుషి ఇలాంటి సినిమా చేయడం ఆనందంగా ఉందన్న ఎస్.జె.సూర్య మళ్లీ అలాంటి సినిమా చేయలేదనే బాధ కూడా ఉందని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ని మొదటిసారిగా బద్రి షూటింగ్ సమయంలో చూశానని ఆ సమయంలోనే తమిళ ఖుషి పట్టాలు ఎక్కక ముందే పవన్ కు కధ చెప్పానని చెప్పుకొచ్చాడు. తమిళ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే దానితో సంబంధం లేకుండా మీకు సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చాడని అలా సినిమా తమిళంలో సూపర్ హిట్ అయి ఆ తరువాత తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయిందని సూర్య చెప్పుకొచ్చాడు.

    అదే నా కోరిక

    అదే నా కోరిక

    ఇక తన గురించి చెబుతూ నటుడు కావాలన్నది నా కోరిక అని పేర్కొన్నారు. జీవితం మొదట్లో ఒక హోటల్లో కప్పులు కడిగానని ఆ సమయంలో సర్వర్గా టేబుల్ ని ఎంత జాగ్రత్తగా శుభ్రం చేశానో దర్శకుడిగా దర్శకత్వం కూడా అలాగే నీట్గా చేశాను అని చెప్పుకొచ్చారు. అలా కష్టపడ్డాను కాబట్టి ప్రస్తుతం తమిళంలో నన్ను ఆర్టిస్ట్ గా గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఒక సినిమాలో హీరోగా మరో సినిమాలో విలన్ గా ఆయన చెప్పుకొచ్చారు. నేను అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదని ఆయన పేర్కొన్నాడు.

    Recommended Video

    Allu Arjun Tests COVID-Positive, In Home Quarantine | Filmibeat telugu
    అందుకే ఎక్కువ రెమ్యునరేషన్ చెబుతున్నా

    అందుకే ఎక్కువ రెమ్యునరేషన్ చెబుతున్నా

    ఇక బొమ్మ అనే సినిమాలో హీరోగా నటించి నేనే నిర్మిస్తున్నానని రాధామోహన్ దీనికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు అని సూర్య చెప్పుకొచ్చారు. ఇవి కాక మరికొన్ని సినిమాల్లో కూడా విలన్ గా నటిస్తున్నానని అయితే విలన్ పాత్రలకు ఫిక్స్ అయిపోవడం ఇష్టం లేక విలన్ పాత్ర కి ఎక్కువ రెమ్యునరేషన్ చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తమిళ, తెలుగు, హిందీ భాషలలో ఒక పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలనేది తన కోరిక అని సూర్య బయటపెట్టాడు.

    English summary
    Pawan Kalyan's Khushi movie completed 20 years. On this eve, movie director SJ Surya says becoming Hero is his target in his interview. He also said at his career starting he worked as hotel server.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X