పవన్‌కు నో చెప్పిన స్టార్ హీరోయిన్: మరో బాలీవుడ్ బ్యూటీతో చర్చలు.. దాదాపుగా ఖాయమైనట్లే.!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్‌లోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరమైన ఆయన.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం వరకూ అసలు సినిమాల్లోనే నటిస్తాడో లేడో అనుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏకంగా మూడు ప్రాజెక్టులను పట్టలెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆయా సినిమాల షూటింగులతో ఆయన బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. వివరాలు...

అందరికీ తెలిసిన దానికే పవన్ మొదటి ప్రాధాన్యం
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘పింక్' సినిమా రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌పై వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే 15న విడుదల చేయనున్నారు. తెలిసిన కథే అయినా పవన్ ఈ సినిమానే మొదట పూర్తి చేయనున్నారు.

మరోసారి హిట్ కొట్టాలని ఆయనకు గ్రీన్ సిగ్నల్
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ‘గబ్బర్ సింగ్' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీశ్ శంకర్‌తో పవన్ సినిమా చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఇటీవల ‘గద్దలకొండ గణేష్'తో సక్సెస్ కొట్టిన హరీశ్.. పవన్ కోసం కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథను రెడీ చేస్తున్నాడని సమాచారం.

ఈ విషయంలో అన్నను ఫాలో అవుతున్న పవన్
ఈ రెండు సినిమాలే కాకుండా పవన్ కల్యాణ్.. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితోనూ సినిమా చేయనున్నాడు. పిరియాడిక్ జోనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్.. స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే చిరంజీవి కూడా ‘సైరా: నరసింహారెడ్డి' మూవీలో అదే తరహా పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

వాళ్లే పవన్ టార్గెట్.. అన్నీ సెట్ చేసేస్తున్నాడు
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తెల్లదొరలకు సంబంధించిన ఆస్తులను కాజేసే వ్యక్తిగా కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ మూవీని కొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్నారని సమాచారం. ‘పింక్' రీమేక్ షూటింగ్ పూర్తయ్యే సరికి దర్శకుడు క్రిష్.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేస్తాడని అంటున్నారు.

పవన్ కల్యాణ్‌కు నో చెప్పిన స్టార్ హీరోయిన్
అన్నీ బాగానే ఉన్నా.. ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మొదట ఇందులో ఆయనకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుందని అన్నారు. రెండు రోజుల క్రితం కియారా అద్వాణి పేరు తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె ఇందులో నటించడానికి ఒప్పుకోలేదట. దీనికి కారణం ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడమేనని సమాచారం.

బాలీవుడ్ బ్యూటీతో చర్చలు.. దాదాపుగా ఖాయమే.!
కియారా ఈ సినిమాలో నటించడానికి నో చెప్పిందన్న వార్తలు వస్తున్న సమయంలోనే.. డైరెక్టర్ క్రిష్ మరో హీరోయిన్‌తో చర్చలు జరిపాడని ఓ వార్త వైరల్ అవుతోంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్. ఈమెను పవన్ సినిమా కోసం ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. గతంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘ఆహా.. కల్యాణం'లో వాణి నటించి మెప్పించింది.


Click it and Unblock the Notifications











