పవన్ - క్రిష్ సినిమా టైటిల్ ఫిక్స్.. ఎవరూ ఊహించని పేరును ఎంచుకున్న చిత్ర యూనిట్.!
మొన్నటి వరకు అసలు సినిమాలు చేస్తాడో లేదో అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన ఆయన.. ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసిన పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించిన చర్చలే కనిపిస్తున్నాయి. దీంతో ఆయన సినిమాల న్యూస్ ఏది బయటకు వచ్చినా హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో క్రిష్‌తో పవన్ చేయనున్న సినిమా టైటిల్ లీక్ అయింది. ఇంతకీ ఏంటా టైటిల్.? వివరాల్లోకి వెళ్తే..

పవన్ మొదటి అడుగు అన్న బాటలోనే
పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయన తన తొలి ప్రయత్నాన్ని రీమేక్ మూవీతో చేస్తున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారానే పవన్ కమ్‌బ్యాక్ చేస్తున్నారు. గతంలో ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా రీమేక్ మూవీతోనే రీఎంట్రీ ఇచ్చిన సంగతి విధితమే.

అదొక్కటే కాదు.. మరో రెండు కూడా
పవన్ కల్యాణ్ ‘పింక్' సినిమా రీమేక్‌లో నటించడానికి ముందే మరో రెండు ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందులో ఒకటి తనకు ‘గబ్బర్ సింగ్' వంటి సక్సెస్‌ఫుల్ మూవీని ఇచ్చిన హరీశ్ శంకర్‌తో కాగా, రెండోది క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

మూడింటిలో అదే చాలా ప్రత్యేకమైనది
పవర్ స్టార్ చేయబోతున్న మూడు సినిమాల్లో క్రిష్ తెరకెక్కించనున్న సినిమా ప్రత్యేకమైనదన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఇది పిరియాడిక్ ఫిల్మ్ కావడమే. గతంలో పవన్ ఈ తరహా సినిమా చేయలేదు. అందువల్లే దీనిని ఆయన ఫ్యాన్స్ ప్రత్యేకంగా చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే క్రిష్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దీనికి ఏఎమ్ రత్నం నిర్మాత.

సరికొత్త లుక్కుతో దర్శనమివ్వనున్నాడు
ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ సరికొత్త లుక్కుతో దర్శనమివ్వనున్నాడని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం... గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమా కోసం పవర్ స్టార్ విగ్గు వాడబోతున్నాడని సమాచారం. స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించనున్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.

పవన్ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లు
పవన్ కల్యాణ్ నటించబోతున్న ఈ సినిమాలో ఏ హీరోయిన్‌ను తీసుకున్నారో చిత్ర యూనిట్ ప్రకటించలేదు. అయినప్పటికీ దీనికి సంబంధించిన వార్తలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. మొదట ఈ సినిమాకు ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నారని అన్నారు. ఆ తర్వాత కియారా అద్వాణీ, వాణీ కపూర్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఈ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
Recommended Video

పవన్ - క్రిష్ సినిమా టైటిల్ ఫిక్స్
తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త లీక్ అయింది. పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ కోసం ‘విరూపాక్ష' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందని సమాచారం. పవన్ కల్యాణ్‌కు ఈ పేరు బాగా నచ్చడంతో వెంటనే దీనిని ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారని అంటున్నారు. సరికొత్త తరహా పేరు కావడంతో పవన్ అభిమానులు ఖుష్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











