Bhola Shankar మూవీలో ఖుషి ఇంటర్వెల్ సీన్ .. చిరుతో శ్రీముఖి మీరు ఊహించని రొమాన్స్
నేడు సినిమా ప్రపంచస్థాయిలో ఎల్లలు దాటుతోంది. అందుకు తగినట్లుగా మూవీస్ తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ప్రేక్షకులకు వినోదం పంచే కార్యక్రమంలో భాగంగా ఒక సినిమాకు సంబంధించిన సన్నివేశాలను మరో మూవీలో రీక్రియేట్ చేస్తున్నారు. అలా ఇటీవల వాల్తేరు వీరయ్యలో రవితేజ ఇడియట్ సీన్ చేయగా.. ధమాకాలో చిరంజీవి ఇంద్ర సినిమా సన్నివేశాన్ని చూపించారు. అలా తాజాగా విడుదలైన చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఖుషి మూవీలోని సూపర్ రొమాంటిక్ సీన్ ను రీక్రియేట్ చేశారు. ఆ సన్నివేశం విషయంలోకి వెళితే..
బాక్సాఫీస్ వద్ద:స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. ఆ మధ్య రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. కత్తి మూవీ రీమెక్ గా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఆ సినిమా కాస్తా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత సైరా నరసింహా రెడ్డి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.

వేదాళం రీమేక్: అనంతరం వచ్చిన ఆచార్య మాత్రం ఘోరంగా చతికిలపడింది. ఇక చిరంజీవి గతేడాది గాడ్ ఫాదర్, ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మంచి హిట్లు అందుకున్నారు. ఈ జోషో తో సినిమాలు చేస్తున్న చిరు ఇవాళ ఆగస్ట్ 11న భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పదేళ్ల క్రితం వచ్చిన అజిత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కించారు.
పాతకాలం నాటి కథ: మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. పాత కాలం నాటి కథను రీమేక్ చేసి ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కానీ, చిరంజీవి స్వాగ్, స్టైల్ మాత్రం సినిమాకు హైలెట్ అంటున్నారు. కీర్తి సురేష్ మెప్పించినా, తమన్నా మాత్రం రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ లా కనపించిందని అభిప్రాయపడుతున్నారు.

ఫ్యాన్ గాలికి చీరకొంగు: ఆగస్ 11న విడుదలైన భోళా శంకర్ సినిమాలోని కొన్ని సీన్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటే పవన్ కల్యాణ్ ఖుషి (Kushi 2001) సినిమాలోని నడుము సీన్. ఈ సన్నివేశాన్ని యాంకర్ శ్రీముఖి-చిరంజీవి మధ్య రీక్రియేట్ చేశారు. శ్రీముఖి నల్ల చీర కట్టుకుని బెంచ్ పై కూర్చుని బుక్ చదువుతూ ఉంటుంది. పక్కనే ఉన్న ఫ్యాన్ గాలికి శ్రీముఖి చీరకొంగు పైకి ఎగిరి నడుము కనిపిస్తుంటుంది.
లెక్కలు తప్పుతాయి: శ్రీముఖి పక్క బెంచ్ పై కూర్చుని డబ్బు లెక్కపెడుతున్న చిరంజీవి గ్లాసులో నీళ్లు తాగుతూ శ్రీముఖి నడుము చూస్తాడు. చిరు చూడటాన్ని చూసిన శ్రీముఖి సీరియస్ గా కొంగు సర్దుకుంటుంది. మళ్లీ ఫ్యాన్ గాలికి ఎగరడంతో చిరు చూస్తాడు. అది చూసిన శ్రీముఖి భోళాజీ అని పిలిచి నువ్ చూసినవ్ అంటుంది. చూసినా.. లేకపోతే లెక్కలు తప్పుతాయి కదా అని చిరంజీవి అంటాడు.
నీ లుక్కులు: లెక్కల గురించి కాదు. నీ లుక్కులు గురించి మాట్లాడుతున్నాను అంటూ సీన్ కొనసాగుతుంది. పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ చిరి డైలాగ్స్ చెబుతాడు. అయితే ఈ సీన్ కు థియేటర్లలో అరుపులు, గోలతో బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా ఈ సీన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











