OG మూవీపై పవన్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ఇక హంగ్రీ చీతా వేట ఆరంభం
తెలుగు సినిమా బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు సినిమాలు అలాగే మరోపక్క ఏపీ పాలిటిక్స్ లో కూడా కీలకంగా ఉన్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ కీలక భాద్యతలు చేపట్టగా తన సినిమాలు అలానే పెండింగ్ లో పడ్డాయి. దీనితో ఇవి ఎప్పుడు మొదలు అవుతాయో మళ్ళీ కొత్త సినిమాలు పవన్ నుంచి ఉంటాయా ఉండవా అనేది ఫ్యాన్స్ కి పెద్ద ప్రశ్నగా మారింది.
పవన్ ఇటీవల రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఎట్టకేలకి తన సినిమాలు కోసం మళ్ళీ మాట్లాడ్డం మాత్రం పవన్ సినిమాలపై కూడా దృష్టి పెట్టాడు అని మూవీ ఫ్యాన్స్ కొంచెం ఊపిరి తీసుకున్నారు. కాగా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమాలు మూడు వరుసగా దర్శకుడు జ్యోతి కృష్ణతో "హరిహర వీరమల్లు", దర్శకుడు హరీష్ శంకర్ తో "ఉస్తాద్ భగత్ సింగ్" అలాగే దీని తర్వాత దర్శకుడు సుజీత్ తో "ఓజి" సినిమాలు అయితే లైన్ లో ఉండగా ఈ చిత్రాల్లో రెండు పాన్ ఇండియా కం, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నాయి.

అయితే ఉన్న ఈ మూడు సినిమాల్లో కూడా ఒకోదానిపై ఒకో అంచనాలు నెలకొనగా పవన్ అభిమానులు అత్యధికంగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం "ఓజి" సినిమానే అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తుండడం పైగా పవన్ టాలెంట్ కి కటౌట్ కి తగ్గ సినిమా ఇదే కావడంతో అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇంకా ఇంట్రెస్టింగ్ గా పవన్ కూడా ఈ సినిమాని పర్శనల్ గా తీసుకోవడం కూడా మరింత స్పెషల్ గా మారింది. కాగా ఆ మధ్య ఓజి సినిమా బాగుంటుంది మీరు చూద్దురు అంటూ చెప్పడంతోనే పవన్ కి ఈ సినిమా ఎంత ప్రత్యేకం అనేది అందరికీ అర్ధం అయ్యింది. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఈ సినిమా పట్ల ఫ్యాన్స్ కి కొంచెం ఊరట ఇచ్చింది అని చెప్పవచ్చు.

కాగా ఈ చిత్రం కోసం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. సాధ్యమైనంత త్వరలోనే సినిమా స్టార్ట్ చేసి పూర్తి చేసేద్దామని మేకర్స్ ప్రామిస్ కూడా చేశారట. దీనితో సుజీత్ కూడా మొత్తం సిద్ధం చేసుకుని ఉన్నాడని తెలుస్తుంది. పవన్ ఇలా డేట్స్ ఇవ్వగానే ప్లానింగ్ ప్రకారం మొత్తం ఫినిష్ చేసి ఫైనల్ అవుట్ పుట్ టేబుల్ మీద పెట్టెయ్యాలని ఫిక్స్ అయ్యి ఉన్నారట.
సో మొత్తానికి హంగ్రీ చీతా మళ్ళీ వేటకు రాబోతుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా అర్జున్ దాస్, సలార్ ఫేమ్ శ్రేయ రెడ్డి, షామ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











