For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ చేతుల మీదుగా సుమ ట్రైలర్.. అలాంటి డైలాగులతో జయమ్మ పంచాయితీ

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై చక్రం తిప్పుతూ టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది యాంకర్ సుమ కనకాల. పేరుకు కేరళ అమ్మాయే అయినా అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉండే ఆమె.. అనర్గళంగా మాట్లాడుతూ ప్రేక్షకులను మాయ చేస్తోంది. అదే సమయంలో అద్భుతమైన టైమింగ్‌తో అదరగొడుతూ ప్రతి కార్యక్రమాన్ని వన్ ఉమెన్ షోగా మార్చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలా చాలా కాలాంగా వరుస పెట్టి షోల మీద షోలను చేస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో చాలా ఈవెంట్లను కూడా నడిపిస్తూ సందడి చేస్తోంది.

  Samantha స్పోర్ట్స్ బ్రాతో సమంత అరాచకం.. అమాంతం పైకి లేపేసి షాకిచ్చిన హీరోయిన్

  అదిరిపోయే టాలెంట్ ఉన్నా సుమ కనకాల చాలా తక్కువ సినిమాల్లోనే నటించింది. మధ్యలో చాలా ఆఫర్లు వచ్చినా ఆమె మాత్రం బుల్లితెరపైన మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత సుమ మరోసారి వెండితెరపై కనువిందు చేయబోతుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రమే 'జయమ్మ పంచాయితీ'. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైనా.. అనివార్య కారణాల వల్ల టాకీ పార్టున అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు. కానీ, ఇటీవలే చిత్రీకరణను పున: ప్రారంభించి సినిమాను కంప్లీట్ చేసుకున్నారు.

  Pawan Kalyan launches Suma Kanakala Jayamma Panchayathi Trailer

  యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'జయమ్మ పంచాయితీ' సినిమాను మే 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఈ సినిమా అందరి దృష్టిలో పడిపోయింది. మరీ ముఖ్యంగా ఇందులో సుమ కనకాల గెటప్‌ అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'జయమ్మ పంచాయితీ' మూవీ నుంచి ట్రైలర్‌ వచ్చింది. దీన్ని టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అధికారికంగా విడుదల చేశారు.

  Bigg Boss Non Stop: ఈ వారం ఊహించని ఓటింగ్‌.. స్ట్రాంగ్ ప్లేయర్‌కు షాక్.. ఈ సారి ఎలిమినేట్ ఎవరంటే!

  ఉత్తరాంధ్ర నేపథ్యంతో 'రా బావా.. మా ఊర్లో పంచాయితీ సూద్దువ్ గానీ.. ఏ ఊర్లో జరగని ఎరైటీ గొడవ ఒకటి జరుగుతోంది' అని చెప్పడంలో జయమ్మ పంచాయితీ ట్రైలర్ ప్రారంభమైంది. ఇద్దరు ఆడ పిల్లల తల్లి అయిన జయమ్మ (సుమ) గ్రామ పంచాయతీ ముందు ఓ సమస్యను లేవనెత్తుతుంది. అది ఆ గ్రామంలో బలమైన ప్రభావాన్ని చూపిందని ఇందులో చూపించారు. ఇక, ఈ ట్రైలర్‌లో సుమ నోటి వెంట వచ్చిన కొన్ని డైలాగులు ఆలోచింపజేసేవిగా.. నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి. అలాగే, 'నీ గంట కట్ చేస్తా, దొంగ ల*** కొడుకుల్లారా' అనే డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఈ ట్రైలర్‌లో చూపించారు. మొత్తానికి ఇది సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేసిందని చెప్పొచ్చు.

  యాంకర్ సుమ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ మూవీలో రెండు ప్రేమ జంటను కూడా చూపించారు. వాళ్ల కథతో జయమ్మకు ముడిపెడుతూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. ఇక, ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించారు. విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాని నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఇది మే 6న విడుదల కాబోతుంది.

  English summary
  Anchor Suma Kanakala Did Jayamma Panchayathi Movie Under Vijay Kumar Kalivarapu Direction. Now Pawan Kalyan launches This Movie Trailer
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X