2024 AP elections: పిఠాపురంలో పవన్‌కు షాక్.. పోస్టల్ బ్యాలెట్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయంటే!
ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో జరిగే రాజకీయం కాస్త ప్రత్యేకంగా నిలుస్తుంది. దీనికి కారణం ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండడమే అని వేరేగా చెప్పనక్కర్లేదు. దీనికితోడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఇందులో ప్రత్యేక ఆకర్షణ అయిన పవన్ కల్యాణ్ పరిస్థితిని ఒకసారి చూద్దాం పదండి!
దేశం మొత్తంలో ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభం అయింది. అన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ముందుగా మొదలు పెట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గతంలో కంటే ఈ సారి అధికారుల ఓటింగ్ ఎక్కువగా జరగడంతో లెక్కింపు కాస్త ఆలస్యం అవబోతుంది. ఇక, ఇప్పటికే జరిగిన రౌండ్లలో మాత్రం కూటమికే కాస్త ఆధిక్యత కనిపిస్తోంది.

ప్రస్తుతం జరుగుతోన్న ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయన 4300 పైచిలుకు ఓట్లతో ముందంజలో దూసుకుపోతున్నారు. ఆయనతో పాటు జనసేన నుంచి మరో నలుగురు అభ్యర్థులు కూడా ఆధిక్యం సాధించారు.
ఇదిలా ఉండగా.. పిఠాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా చెల్లని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో వాటిని అధికారులు వేరు చేసి రిజెక్ట్ చేసేశారు. ఇక, ఈ విషయంలో పవన్ కల్యాణ్‌కు ఒక రకంగా షాక్ తగిలినట్లు చెప్పొచ్చు. దీనికి కారణం అధికారులు ఎక్కువగా కూటమికే మద్దతు తెలిపారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


Click it and Unblock the Notifications











