పింక్ రీమేక్ లీకులు.. అదిరిపోయిన డైలాగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై రెండు మూడేళ్లు అవుతోంది. చివరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి బెడిసికొట్టడంతో పూర్తిగా సినిమాలను వదిలేసి.. రాజకీయాలకు టైమ్ కేటాయించాడు. అయితే మళ్లీ మేకప్‌వేసుకోవాలని ఫిక్స్ అయిన పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు చిత్రాలను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

పింక్ రీమేక్ మొదలు..
బాలీవుడ్ హిట్ చిత్రం పింక్‌ను ఇప్పటికే తమిళంలో రీమేక్ చేయగా.. మంచి విజయాన్ని నమోదు చేసింది. తాజాగా తెలుగులోనూ రీమేక్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వబోతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే లీకైన పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.
టీషర్ట్స్‌కు డిమాండ్..
మొదటి రోజు షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఓ పిక్.. ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పడు అదే పోస్టర్‌ను టీ షర్ట్ వేసి అన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశారు. అలా పెట్టడం ఆలస్యం ఇలా అయిపోతుండటంతో పవన్ క్రేజ్‌కు నిదర్శనం.

తాజాగా మరోసారి లీక్..
తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లీకైంది. ఫైటింగ్ సీనే కదా అని అనుకుంటే పొరబాటే. అందులో పవన్ మార్క్ డైలాగ్ ఒకటి ఉంది. ‘ఎన్నేళ్లైనా ,ఎన్నాళ్లైనా నాలో ఆవేశం తగదు.. ఒక్కసారి నేను నల్ల కోటు వేసుకున్నాను అంటే.. వేసుకోవడానికి పిటిషలు ,తీసుకోవడానికి బెయిల్‌లు ఉండవు.. అంటూ అదిరిపోయే డైలాగ్ చెప్పాడు. ఇక ఇలాంటి మూమెంట్స్ అంటే ఫ్యాన్స్‌కు పూనకాలే.

ప్రారంభమైన క్రిష్ మూవీ షూటింగ్..
ఓ వైపు పింక్ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. క్రిష్‌తో ఓ పీరియాడిక్ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తవ్వగా.. నేడు షూటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











