ఫ్యాన్స్ కి పవన్ అన్యాయం..డిప్యూటీ సీఎం వదిలేసిన కల్ట్ సినిమా ఏంటో తెలుసా?

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరని తెలిసిందే. కాగా పవన్ సినిమా సహా రాజకీయ ప్రయాణం ఒక యుద్ధం లానే నడిచాయి అని తెలిసిందే. సినీ పరిశ్రమలోకి మెగా బ్రాండ్ తోనే వచ్చినప్పటికీ దాని కంటే ముందు పవన్ పడ్డ కష్టం సవాళ్లు ఏంటి అనేవి చాలా తక్కువమందికే తెలుసు.

అలా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఏ హీరోకి లేని విధంగా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ పవన్ ని వరించాయి. కానీ ఇండస్ట్రీ హిట్ ఖుషి తర్వాత పవన్ కి గడ్డు కాలం స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి జల్సా వరకు చేసిన అన్ని సినిమాలు విఫలం అయ్యాయి. కానీ తన క్రేజ్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చెక్కు చెదరలేదు.

pawan kalyan lost another classic hit kick in tollywood it done by raviteja

అయితే మన తెలుగు సినిమా దగ్గర పవన్ వదులుకున్న సినిమాల కోసం ఒక సెపరేట్ ఇంట్రెస్టింగ్ డిబేట్ కూడా పెట్టొచ్చు. పవన్ ఇన్నేళ్ల కెరీర్ లో తాను వదులుకున్న అన్ని సినిమాలు గాని చేసి ఉంటే అవి లేకుండానే ఈ రేంజ్ క్రేజ్ ఉంది ఒకవేళ అవి కూడా చేసి ఉంటే పవన్ క్రేజ్ ఇంకెలా ఉండేదో ఊహలకి కూడ అందదు అని చెప్పడంలో అతి లేదు.

కాగా ఇపుడు వరకు పవన్ వదిలేసిన సినిమాల్లో అతడు, పోకిరి, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. కానీ వీటి అన్నిటికీ మించిన షాక్ ఇపుడు పవన్ ఫ్యాన్స్ కి తగిలింది. పవన్ కోసం రెడీ చేసిన కథల్లో చాలా వరకు మహేష్, రవితేజ లకే వెళ్లాయి. కాగా ఇపుడు చెప్పబోయే సినిమా కూడా రవితేజ దగ్గరకి వెళ్ళిందే అట..

pawan kalyan lost another classic hit kick in tollywood it done by raviteja

కాగా ఆ సినిమా ఏదో కూడా కాదు రవితేజ కెరీర్ లో కల్ట్ హిట్ 'కిక్' సినిమానే అట. అప్పుడు పవన్ జల్సా సినిమా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి కిక్ సినిమా పవన్ కోసమే ముందు అనుకున్నాడట కానీ అది పవన్ చేయలేదు. దీనితో ఆ కథ రవితేజ దగ్గరకి వెళ్ళింది. సీన్ కట్ చేస్తే ఈ సినిమా భారీ హిట్ అయ్యింది. అప్పట్లో అయితే రవితేజ సహా టాలీవుడ్ లో కూడా హైయెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచింది.

మరి ఇప్పటికీ ఈ సినిమాకి తెలుగు ఆడియెన్స్ లో ఒక సుస్థిర స్థానం ఉంది. అలాంటి సినిమాని కూడా పవన్ వదులుకోవడంతో ఇపుడు పవన్ ఫ్యాన్స్ కి తమ అభిమాన హీరో విషయంలో ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావట్లేదు. కాగా ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి వెల్లడించారు. దీనితో పవన్ వదులుకున్న ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఇదొకటిగా కొత్తగా లిస్ట్ లో జాయిన్ అయ్యింది. మరి ఈ సినిమాలు అన్నీ పవన్ చేసుకుని ఉంటే తన రేంజ్ ఇంకో లెవెల్లో ఉండేది. కానీ అవి వదిలేసి పవన్ రీమేక్ సినిమాలు ప్రిఫర్ చేసుకోవడం గమనార్హం.

More from Filmibeat

Read more about: pawan kalyan raviteja kick
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X