Mirabai Chanu: భారతీయ వెయిట్ లిఫ్టర్‌పై పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ప్రశంసల వర్షం
దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు మీరాభాయ్ ఛాను. టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్ క్రీడలో వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల 49 కేజీల విభాగంలో మీరాభాయి ఛాను సిల్వర్ మెడల్ సొంతం చేసుకోవడంతో ప్రశంసల వర్షం కురిస్తున్నది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులతోపాటు సాధారణ ప్రజల కూడా ఆమె ప్రతిభపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు తమ స్పందనను వ్యక్తం చేశారు. అరుదైన ఫీట్‌ను సాధించి దేశానికి గర్వకారణమైన మీరాభాయిని ప్రశంసిస్తూ..
పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేసి.. గత 20 ఏళ్లలో తొలిసారి భారత్‌కు అరుదైన పతకం లభించింది. ఇది భారతీయ క్రీడా చరిత్రలో అరుదైన రికార్డు. క్రీడావృద్ధికి బాగా దోహదపడుతుంది. కరణం మళ్లీశ్వరి తర్వాత దేశ పతాకాన్ని రెపరెపలాడించారు అని అన్నారు.

మీరాభాయి సాధించిన ఘనతకు దేశం ఉప్పొంగిపోతున్నది. యువతకు మంచి స్పూర్తిని కలిగిస్తున్నది. దేశంలోని క్రీడాకారులరులకే కాకుండా టోక్యోలో పాల్గొంటున్న క్రీడాకారులకు మంచి స్పూర్తిని కలిగిస్తుంది అని ఓ ప్రకటనలో పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
టోక్యో క్రీడల్లో భారతీయ క్రీడాకారులు అద్బుతమైన ప్రారంభాన్ని ఇచ్చారు. మహిళ వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాభాయి ఛాను సిల్వర్ మెడల్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది. అందుకు ఆమెకు నా కంగ్రాట్యులేషన్. ఒలింపిక్‌లో మన యాక్షన్ మొదలైంది అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











