HHMV: హరిహర వీరమల్లులో ఆ రెండు ఫ్యాన్స్‌కు పండుగే.. పవన్ కల్యాణ్ ఎలివేషన్స్ కిర్రాక్ అంట!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి హరి హర వీరమల్లు చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేశారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు 'హరి హర వీరమల్లు'లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. అయితే ఈ సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ క్యారెక్టర్‌కు విషయం వైరల్ అవుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

హరిహర వీరమల్లు సినిమా కథ విషయానికి వస్తే.. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కింది. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారనడం కంటే జీవించారని చెబుతున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. సత్యం, విశ్వాసం, స్వేచ్ఛ కోసం జరిగే న్యాయం, సనాతన ధర్మం కోసం పోరాడిన వీరుడి పవర్ ఫుల్ జర్నీని తెర మీద చూడబోతున్నామనే టాక్ చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తున్నది.
అయితే సాధారణంగా ఈ మూవీలోనైనా హీరో ఎంట్రీని హై ఎలివేషన్‌తో భారీగా డిజైన్ చేస్తారు. కానీ ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు సంబంధించి రెండు ఎంట్రీలను డిజైన్ చేశారు. ఆ రెండు ఎంట్రీలను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. అయితే తొలుత ఒకటే హీరో ఎంట్రీని సినిమాలో పెట్టాలని అనుకొన్నారు. కానీ కథలో రెండు ఎంట్రీలకు స్కోప్ ఉండటంతో వాటిని చక్కగా జోప్పించారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.
అయితే పవన్ కల్యాణ్ రెండు ఎంట్రీలు సినిమాలో హైలెట్‌గా ఉంటాయి. ఈ రెండు ఎంట్రీలు పవర్ స్టార్ అభిమానులకు పండుగలా ఉంటాయి. ఈ రెండు ఎంట్రీల ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. వాటికి ఫ్యాన్స్ విజిల్స్, కేకలతో థియేటర్ హోరెత్తి పోవడం ఖాయం. ఈ రెండు ఎంట్రీలే కాకుండా ఇంకా ఎలివేషన్స్ భారీ స్థాయిలో ఉన్నాయి అనే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించింది.
హరి హర వీరమల్లు చిత్రంలో పవన్ కల్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుండి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్ కళ్యాణ్ లో ఉన్న అద్భుతమైన లక్షణాలను గమనించిన తర్వాతే ఆయన పాత్రను రాయడానికి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











