అల్లు అర్జున్ కోసం పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ ముగ్గురు కలిస్తే అన్ని వర్గాల ఆడియేన్స్ కు ఫుల్ మీల్స్ దొరికినట్లే. ఈ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా అల్లు అర్జున్ మొదటి సారి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
అయితే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా కూడా విడుదల కావాల్సింది. ఆగస్ట్ నెలలో పెద్ద సినిమా ఏది రిలీజ్ కావడం లేదని ఆ సమయంలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఆ సినిమాపై మెగా అభిమానుల్లో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఆల్ మోస్ట్ ఆగస్ట్ మొదటి వారంలో లేదా రెండవ వారంలో రావాలని అనుకున్నారు. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి ఆ సమయాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక పవన్ వకీల్ సాబ్ ఎలాగూ ఏప్రిల్ లో వస్తుంది కాబట్టి గ్యాప్ వచ్చిన పరవలేదని ఆ రీమేక్ ను వినాయకచవితికి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. కుదిరితే సెప్టెంబర్ సెకండ్ వీక్ లో రావచ్చని అంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద వీరి సినిమాలు ఏ రేంజ్ లో క్లిక్కవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











