RRR సందడిలో పవన్ కళ్యాణ్: తారక్ కోసం బాబాయ్‌ను బైక్ అడిగిన రామ్ చరణ్
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR పాన్ ఇండియా అంచనాలను ఈజీగా అందుకునేలా ఉంది. ప్రమోషన్ లో జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేసే దర్శకుడు రాజమౌళి మొత్తానికి సినిమా అప్డేట్ మాత్రమే ఇవ్వకుండా ఒక స్పెషల్ పోస్టర్ కూడా వదిలి ఇరు వర్గాల అభిమానులకు మంచి కిక్కిచ్చాడు. ఇక ఈ సారి పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రమోషన్ లో వైరల్ అవ్వడం స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు.

బిజినెస్ తోనే సరికొత్త రికార్డు
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కోసం ఓ వైపు మెగా అభిమానులు మరోవైపు నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమాపై బజ్ అయితే బాగానే క్రియేట్ అయ్యింది. ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిన. దాదాపు 900కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత బిజీగా రాజమౌళి
లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఓ కొలిక్కి వచ్చేవి. ఇక ప్రస్తుతం అయితే కేవలం రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ పనులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. డబ్బింగ్ పనులన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. ఇక ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి బిజీ కానున్నాడు.

అద్భుతంగా ఉంటుందని
ఇక మంగళవారం అప్డేట్ తో పాటు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు లకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తారక్ బైక్ నడిపిస్తూ ఉండగా చరణ్ వెనకాలే ఒక స్నేహితుడిగా రామ్ చరణ్ కూర్చొని ఉన్నాడు. సినిమాలో వారి బాండింగ్ లో ఈ యాంగిల్ అద్భుతంగా ఉంటుందని వివరణ ఇచ్చేశారు.

పవన్ కళ్యాణ్ బైక్
అయితే ఈ ప్రమోషన్ లో పవన్ కళ్యాణ్ పేరుతో పాటు ఫొటో కూడా వైరల్ అయ్యింది. పోస్టర్ లో ఉన్న బైక్ ను ఇదివరకే పవన్ కళ్యాణ్ వాడినట్లు క్లారిటీగా అర్ధమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో RRR లుక్ తో పాటు పవన్ కళ్యాణ్ స్టిల్ కూడా వైరల్ అవుతోంది. చాలా వరకు పవన్ తన సినిమాల్లో సరికొత్త బైక్స్ తో ఆకట్టుకునేవారు.

బాబాయ్ ను బైక్ అడుగుతున్న రామ్ చరణ్
ఇక రెండు బైక్స్ ఒకేలా ఉండడంతో అభిమానులు వాటిని వైరల్ అయ్యేలా చేస్తున్నారు. కొంతమంది మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఒక మీమ్ లో అయితే.. తారక్ నేను బయటకు వెళతాము అంటూ బాబాయ్ ను రామ్ చరణ్ బైక్ అడుగుతున్నట్లు ఉంది. జాగ్రత్తగా వేళ్ళు అంటూ పవన్ చెప్పినట్లుగా ఉండడం చూస్తే కుర్రాళ్ళ రియల్ లైఫ్ లో జరిగే సన్నివేశంలా అనిపిస్తోంది. ఆ విధంగా పవన్ మ్యానియా ఇక్కడ కూడా కొనసాగుతుండడం విశేషం.


Click it and Unblock the Notifications











