‘సైరా’ మేకింగ్ వీడియోలో సర్‌ప్రైజ్.. మెగా ఫ్యాన్స్‌కు కనుల విందు

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే 'సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఈ క్రమంలోనే 'సైరా' మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ 14వ తేదీన మధ్యాహ్నం 3.45 గంటలకు విడుదల చేసింది. 1.47 నిమిషాలున్న ఈ వీడియోకు కొద్ది సమయంలోనే విశేష స్పందన వస్తోంది. సినిమాలో నటించే పాత్రలన్నింటీని ఈ వీడియోలో పరిచయం చేశారు.

 Pawan Kalyan, Niharika Special Attraction In Sye Raa Narasimha Reddy Making Video

ముఖ్యంగా ఈ మేకింగ్ వీడియోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా డాటర్ నిహారిక స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు. పవన్ సినిమాలో నటించకపోయినా.. ఆయనకు సంబంధించిన వీడియోను యాడ్ చేశారు. నిహారిక మాత్రం ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఆమెను పరిచయం చేశారు.

ముందుగా.. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్‌ను చూపించే సమయంలో పవన్ కల్యాణ్‌ సెట్స్‌కు వచ్చినప్పటి క్లిప్స్ చూపించారు. అలాగే, మెగా డాటర్ నిహారిక కూడా ఈ వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె పాత్రను పరిచయం చేసిన సమయంలో బ్రిటీష్ సైన్యంతో పోరాటం చేస్తున్న సన్నివేశాన్ని చూపించారు. ఇక, చివర్లో నిర్మాత అయిన రామ్ చరణ్‌ను.. ఆ తర్వాత చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవిని పరిచయం చేశారు. ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X