Bheemla Nayak నుంచి షాకింగ్ న్యూస్: అంటే పవన్ గురించి బయటకు వచ్చిన వార్త అబద్ధమా!

సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. గతంలో కంటే ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతడు వరుసగా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తుండడమే. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే మూవీలో నటించిన అతడు.. అది షూటింగ్ జరుగుతుండగానే మరిన్ని సినిమాలను ప్రకటించాడు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో 'భీమ్లా నాయక్' ఒకటి. భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి.

విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న చిత్రమే 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాకు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కల్యాణ్‌తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, ఇటీవలే దీన్ని పున: ప్రారంభించి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.

Pawan Kalyan Not Complete Bheemla Nayak Shoot

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' మూవీకి సంబంధించిన షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. అంతేకాదు, ఇటీవలే ఈ సినిమాలో తన పార్ట్‌కు సంబంధించిన షూట్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పూర్తి చేసేశాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, కొద్ది రోజుల్లోనే అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యా టూర్ కూడా వెళ్లబోతున్నాడని ప్రచారం జరిగింది. దీంతో 'భీమ్లా నాయక్' మూవీ అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని పవర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా సంతోషం వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ షాక్‌కు గురి చేసే న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ సినిమా షూటింగ్‌ను పవన్ కల్యాణ్ ఇంకా పూర్తి చేయలేదట. అంతేకాదు, ఇప్పుడు అతడు వికారాబాద్‌లో జరుగుతోన్న షెడ్యూల్‌లో పాల్గొంటున్నాడని తెలిసింది. అక్కడ పవన్ ‌కల్యాణ్‌ను చూసేందుకు చుట్టుపక్కల జనం ఎగబడుతోన్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీంతో ఈ షూటింగ్ గురించి అప్‌డేట్‌పై క్లారిటీ వచ్చింది. మరోవైపు, పవన్ పార్ట్ రెండు రోజుల్లో పూర్తి అవుతుందని కూడా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Pawan Kalyan Not Complete Bheemla Nayak Shoot

ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. దీనికి ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X