twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆపత్కాలంలో పెద్ద మనసు: ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

    |

    ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి నుంచి భారత ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. పెద్దఎత్తున సహాయక చర్యలు చేపడుతూ రేయింబవళ్లు కష్టపడుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరోవైపు ప్రభుత్వానికి అండగా మేమున్నాం అంటూ పలువురు సినీ ప్రముఖులు స్వచ్చందంగా ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటిస్తున్నారు.

    తెలుగు చిత్రసీమ నుంచి చిన్నా పెద్దా అనే తేడాలేకుండా దాదాపు అందరు నటీనటులు, దర్శక నిర్మాతలు కరోనా కట్టడిలో భాగమవుతూ సీఎం, పీఎం సహాయనిధికి ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. అదేవిధంగా సినీ కార్మికుల కోసం ప్రత్యేకంగా చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి కరోనా కారణంగా సినీ రంగంలో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకుంటున్నారు.

     Pawan Kalyan Official Note On corona crisis Doners

    ఈ నేపథ్యంలో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జనసేన పార్టీ తరఫున అఫీషియల్ నోట్ విడుదల చేశారు పవన్ కళ్యాణ్. కరోనా మహహ్మారి విజృభించిన ఆపత్కాలమిది. ఈ సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు, సినీ కార్మిక లోకానికి అండగా నిలిచి పెద్ద మనసు చాటుకుంటున్న సినిమా కుటుంబానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.

    కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు, లాక్‌డౌన్ కారణంగా ఇక్కట్లలో ఉన్నవారికి బాసటగా నిలిచేందుకు నిధులు చాలా అవసరమని పేర్కొన్న పవన్.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కి, కరోనా క్రైసిస్ చారిటీకి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

    English summary
    The 21 Days Lock down to control Corona Virus outbreak leads to stop all activity in the Film industry. Daily wage film workers are facing troubles due to lack of shootings. So many celabrities contribute their funds to Corona Crisis Charity. Now Pawan Kalyan reacted on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X