పవన్ కళ్యాణ్ OG రిలీజ్ టార్గెట్.. ఫ్యాన్స్ అప్పటి వరకు ఎదురుచూడాలా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాలు తుదిదశలో ఉండగా మరికొన్ని సినిమాలో శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటున్నాయి.
పవన్ కళ్యాణ్ ఎక్కువగా అగ్ర దర్శకులతో కాకుండా లేటెస్ట్ గా ఆడియన్స్ ను మెస్పరైస్ చేసే యువ దర్శకులతో కూడా వర్క్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక దర్శకుల ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా కూడా ఆయన మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లో ఉన్న సినిమాలన్నీ కూడా ఆసక్తిని కలిగించేవే. హరిహర వీరమల్లు సినిమా ఒక చారిత్రాత్మక కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను క్రిష్ తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే వినోదాయ సీతం రీమేక్ కంప్లీట్ గా ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ పనులను కూడా ఇప్పటికే పవన్ పూర్తి చేసుకున్నాడు.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా మంచి సందేశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే పవన్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే ప్రాజెక్టును ఇటీవల స్టార్ట్ చేసిన విషయం తెలిసింది. ముంబై బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ ఒక మాఫియా గ్యాంగ్ స్టర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. పవన్ కళ్యాణ్ షూటింగ్ పనులను కూడా మొదలుపెట్టాడు.
ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు చాలా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సరైన పండగ సమయంలో రావాలని అనుకుంటున్నారు. అందుకోసం 2025 సంక్రాంతిని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.
అంతకు ముందు అయితే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా విడుదల కానున్నాయి. ఇక ఈ OG సినిమా మాత్రం 2025 లో తీసుకురావాలని అనుకుంటున్నారు. ఒక విధంగా ఫ్యాన్స్ కు ఇది నిరాశ కలిగించే విషయమే. అప్పటి వరకు ఎదురు చూడాలా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి నిర్మాత డివివి. ధానయ్య ఈ విషయంలో మరోసారి ఆలోచిస్తారా? లేక అదే డేట్ ఫిక్స్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











