OG in Hindi : నార్త్ లో మొదలైన OG తుఫాన్ .. రోజురోజుకు థియేటర్ల సంఖ్య పెంపు.. వివరాలు

ఇప్పుడంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీనే నడుస్తోంది. తెలుగు స్టేట్స్ లో ఒక రేంజ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే రేంజ్ లో ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలోనూ దుమ్ములేపుతున్నారు పవర్ స్టార్. కాగా ఈ చిత్రం కర్టాటక, తమిళం, కేరళలోనూ రచ్చ చేస్తోంది. అయితే నార్త్ లో మాత్రం సినిమా విడుదలైనప్పటి నుంచి 2 రోజులుగా పెద్దగా సందడి కనిపించలేదు. ఇక 3వ రోజు నుంచి నార్త్ ఇండియాలో OG తుఫాన్ మొదలైంది. రోజురోజుకు OG సినిమాకు సంబంధించిన థియేటర్ల సంఖ్య పెరుగుతోందని బాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

పవన్ కళ్యాణ్ OG సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ సౌత్, ఓవర్సీస్ లో ఊహించిన విధంగానే థియేట్రికల్ రిలీజ్ జరిగి మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇక పాన్ ఇండియా సినిమాగా ప్రచారం చేసిన మేకర్స్ OG చిత్రాన్ని ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెటింగ్ ఉన్న నార్త్ ఇండియాలో విడుదల చేయడంలో కాస్తా పొరపాటు చేశారని సినీ విశ్లేషకులు తెలిపారు. ఓటీటీతో కేవలం 4 వారాలకే ఒప్పందం పెట్టుకోవడంతో ఈ చిత్రం నార్త్ ఇండియాలో భారీ స్థాయిలో విడుదలకు నోచుకోలేదు.

Pawan Kalyan OG Movie Rising in North India

హిందీ బెల్డ్ లోని మల్టీప్లెక్స్ చైన్స్ లో ఏ సినిమా విడుదల కావాలన్నా 8 వారాల వరకు ఓటీటీకి స్ట్రీమింగ్ హక్కులు అస్సలు ఇవ్వకూడదు. ఎనిమిది వారాలు థియేట్రికల్ రన్ జరగాల్సిందే. కానీ OG సినిమా మాత్రం అన్ని భాషల్లో 4 వారాలకే స్ట్రీమింగ్ హక్కులను ఇచ్చేసిందని, దాంతో నార్త్ మార్కెట్ లో OG హవా చూపించే మంచి అవకాశం కోల్పోయిందని పలువురు సినీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక నార్త్ లో హిందీ వెర్షన్ తో ఓపెనింగ్ డే అత్యల్పంగా సింగిల్ స్క్రీన్స్ లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఓవర్సీస్, సౌత్ అంతటా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మ్యానియానే ఉండటంతో ఈ సినిమాపై నార్త్ ఆడియెన్స్ లోనూ ఆసక్తి నెలకొంది. దీంతో ప్రదర్శించిన థియేటరల్లో ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో తప్పనిసరిగా హిందీ వెర్షన్ కోసం థియేటర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ మేరకు నార్త్ లో OG మూవీ హిందీ వెర్షన్ కసం థియేటర్లను పెంచుతూ పోతున్నారు. పాజిటివ్ టాక్ తో పాటు, మౌత్ టాక్ భారీ స్థాయిలో ఉండటంతో హిందీలోనూ OG హవా కొనసాగుతోంది.

తొలి రోజు సెప్టెంబర్ 25న హిందీలో కేవలం 556 థియేటర్లలో 1,574 షోలు మాత్రమే ప్రదర్శితమైంది ఓజీ సినిమా. ఇక 2వ రోజు సెప్టెంబర్ 26న 777 థియేటర్లలో 2,390 షోలు ప్రదర్శితమైంది. ఇక 3వ రోజు సెప్టెంబర్ 28న 804 థియేటర్లలో 2499 షోలుగా OG సినిమాను ప్రదర్శించారని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక సెప్టెంబర్ 28న 4వ రోజు హిందీ వెర్షన్ ఏకంగా 850 థియేటర్లలో 2500 షోలు ప్రదర్శితం అవుతుందని తెలుపుతున్నారు. ఇలా నాలుగు రోజుల్లో థియేటర్ల సంఖ్య 300 వరకు పెరిగడం విశేషంగా మారింది.

More from Filmibeat

Read more about: pawan kalyan og movie sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X