OG Release Date పవన్ కల్యాణ్ ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మూవీ విడుదల తేదీ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న OG (Original Gangster) చిత్రం షూటింగ్ దశలోనే ఉండగానే ఎవరూ ఊహించని విధంగా క్రేజ్ నెలకొన్నది. RRR లాంటి ఆస్కార్ రేంజ్ సినిమాను రూపొందించిన ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్, శ్రీయారెడ్డి తదితరులు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనే ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ విశేషాలు, రిలీజ్ డేట్ గురించిన వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హిందీ రంగానికి చెందిన ఇమ్రాన్ హష్మీ, మలయాళం సినీ రంగానికి చెందిన అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు.

Pawan Kalyan s OG Movie to set release in September 2024 Here is the Date details

అయితే అనుకొన్న ప్లాన్ ప్రకారం.. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో విడుదల వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉండటంతో సూటింగ్ వాయిదా పడింది. దాంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అనేక సందేహాలు నెలకొన్నాయి.

అయితే జూన్ మొదటి వారంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం పూర్తి అవుతుంది. జూలై చివరి వారంలో గానీ, ఆగస్టు తొలివారంలో పవన్ కల్యాణ్ ఓజీ మూవీ షూటింగ్‌కు హాజరవుతారు. ఇప్పటికే ముంబైలో తొలి షెడ్యూల్ ముగిసినందున్న.. మిగితా పార్ట్‌ను మొదలుపెట్టి ఒకే షెడ్యూల్‌లో టాకీ పార్ట్ పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది.

Pawan Kalyan s OG Movie to set release in September 2024 Here is the Date details

అయితే తాజాగా ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరైన నిర్మాత డీవీవీ దానయ్య OG మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది అని చెప్పగానే.. అభిమానులు గొడవ చేశారు. దాంతో ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతుంది అని అఫీషియల్‌గా ఆయన క్లారిటీ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ సంబంరంలో మునిగిపోయారు.

OG మూవీ సాంకేతిక వివరాల్లోకి వెళితే.. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫిని, తమన్ ఎస్ సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలీ నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X