పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫాన్స్ కోరిక మేరకు!
పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. జనసేన పార్టీ కార్యక్రమాలతో పవన్ బిజీగా గడుపుతున్నారు. అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ సినిమాలకు దూరమయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం ఫాన్స్ ని నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కు ఉన్న అశేషమైన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులు సోషల్ మీడియాలో పవన్ కు సంబందించిన ట్రెండింగ్స్ తో మోతమోగిస్తుండడం తరచుగా చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ ని ట్విట్టర్ లో మిలియన్ల కొద్దీ అభిమానులు ఫాలో అవుతున్నారు.

ట్విట్టర్ తో పాటు పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్ లో కూడా ఖాతా తెరవాలనేది అభిమానుల కోరిక. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరబోతోంది. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఫేస్ బుక్ లో ఖాతా తెరవబోతున్నారు. ఈ వార్త బయటకు రావడంతో అప్పుడే అభిమానుల్లో సందడి మొదలైంది.


Click it and Unblock the Notifications











