పవన్ సినిమాపై అదిరిపోయే అప్‌డేట్: ఫొటోతో లీక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో టాలీవుడ్‌లో బడా హీరోగా వెలుగొందుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ స్టార్ హీరో జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ఇలా ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో పవన్ రెట్టించిన జోష్‌తో ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే ఈ మెగా హీరో ఎన్నో చిత్రాలను కూడా మొదలు పెట్టేశాడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదలు పెట్టిన సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో ఈ స్టార్ హీరో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, మధ్యలో కొన్ని అవాంతరాలు రావడంతో చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ చాలా వరకూ పెండింగ్ పడింది. దీంతో వీలు కుదిరినప్పుడల్లా పవన్ ఈ మూవీ షూట్‌లో పాల్గొంటున్నాడు.

Pawan Kalyan Participates in Harihara Veeramallu Workshop

'హరిహర వీరమల్లు' మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగస్టులోనే పున: ప్రారంభం కావాల్సి ఉన్నా.. అలా జరగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇందులో పవన్ మాసీ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను అక్టోబర్ 17 నుంచి ప్రారంభించబోతున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారనే ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X