Krishnam Raju No More: పవన్ కళ్యాణ్ రాగానే లోపలికి తీసుకెళ్లిన ప్రభాస్.. ఎమోషనల్ మూమెంట్!

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్తతో ఒక్కసారిగా సినీ లోకం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక మహానటుడిని మంచి మనిషిని కోల్పోయినట్లుగా ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. ఇక కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కూడా తీవ్రస్థాయిలో శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ తరుణంలో ప్రముఖ సినీ తారలు ప్రభాస్ ను అలాగే వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలుసుకొని వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఇక ప్రభాస్ ను కలుసుకొని కొద్దిసేపటి అనంతరం లోపల ఇంట్లోకి కూడా తీసుకువెళ్లారు, . ఆ వివరాల్లోకి వెళితే..

కొన్ని రోజుల క్రితమే..

కొన్ని రోజుల క్రితమే..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక ఈ మరణ వార్తతో ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా షాక్ కు గురయ్యారు. కొన్ని రోజుల క్రితమే కొంత అనారోగ్య కారణంగా హాస్పిటల్ లో చేరిన కృష్ణంరాజు మళ్ళీ వెంటనే వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలోనే ఆయన కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

 స్టార్ హీరోల నివాళులు

స్టార్ హీరోల నివాళులు

ఇక కృష్ణంరాజు మృతి చెందిన వార్త గురించి తెలుసుకోగానే సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ఆయనకు నివాళులర్పించారు. హాస్పిటల్ నుంచి కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు అనంతరం మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలాగే మరి కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలిశారు.

ప్రభాడ్ ను ఓదార్చిన పవన్

ప్రభాడ్ ను ఓదార్చిన పవన్

ఇక జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా కృష్ణంరాజుకు నివాళులర్పించారు. అనంతరం ఆయన బాధలో ఉన్న హీరో ప్రభాస్ ని కూడా ఓదర్చారు. కొద్దిసేపటి అనంతరం ప్రభాస్ పవన్ కళ్యాణ్ తన ఇంట్లోకి తీసుకువెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాళ్ళను కలుసుకునేందుకు

వాళ్ళను కలుసుకునేందుకు

ప్రభాస్ పవన్ కళ్యాణ్ అలా తీసుకువెళ్లడానికి ఒక కారణం ఉంది. కృష్ణ రాజు సతీమణి అలాగే వారి సోదరీమణులు అందరు కూడా లోపలే ఉండడంతో వారిని కూడా కలిసి ఓదార్చేందుకు పవన్ కళ్యాణ్ ను అక్కడికి తీసుకువెళ్లడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను కలిసిన పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని అందించి వారికి ధైర్యం చెప్పారు. మెగా ఫ్యామిలీకి కృష్ణంరాజు కుటుంబానికి చాలా కాలంగా మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే.

ఎమోషనల్ మూమెంట్స్

ఎమోషనల్ మూమెంట్స్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ కు సంబంధించిన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక అందులో పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ప్రభాస్ ను కలిసిన విజువల్స్ కూడా ఫాన్స్ ను కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ శోకసంద్రం నుంచి వారు కోలుకోవాలని, భగవంతుడు వారికి మరింత బలాన్ని ఇవ్వాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక సోమవారం రోజు కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X