vakeel saab leaked pic సెట్ నుంచి అలా.. పవన్ కళ్యాణ్‌కు గాయాలు!
పవన్ కళ్యాణ్ సినిమాలకు లీకులకు దగ్గరి సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లీకైన పిక్స్ కూడా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూ ఓ మార్క్‌ను సెట్ చేస్తుంటాయి. అలా వకీల్ సాబ్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వడం, సెట్‌లో మొదటిసారిగా ఎంట్రీ ఇవ్వడంతో బయటకు లీకైన ఓ పిక్ ఏకంగా టైటిల్ పోస్టర్‌లోనే పెట్టాల్సి వచ్చింది. అంటే ఆ పిక్ ఎంతగా వైరల్అయిందో ఊహించుకోవచ్చు.

వకీల్ సాబ్ లీకుల మయం..
వకీల్ సాబ్ మొదటి నుంచి లీకుల బారిన పడుతూనే ఉంది. ఫస్ట్ డే సెట్‌లో అడుగుపెట్టిన సమయంలోనే ఓ ఫోటో బయటకు వచ్చింది. ఆ తరువాత మళ్లీ ఓ యాక్షన్ సీక్వెన్స్, భారీ డైలాగ్‌లు బయటకు వచ్చాయి. అలా నిత్యం వకీల్ సాబ్ లీకుల బారిన పడుతూనే ఉంది.

తాజగా అలా..
అసలే లాక్డౌన్ కారణంగా వకీల్ సాబ్ వాయిదాల మీద వాయిదాలు పడింది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఇంత ఆలస్యమవుతూ వచ్చింది. కరోనా వల్ల సినిమా షూటింగ్ ఆలస్యంగా మొదలైంది. అలా మొదలైన షూటింగ్ పవన్ కళ్యాణ్ రాజకీయాలు, వ్యక్తిగత కారణాల వల్ల మరింత వాయిదా పడుతూ వస్తోంది. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో షూటింగ్ చేస్తూ ఉంటే తాజాగా మరికొన్ని ఫోటోలు, వీడియోలు లీకయ్యాయి.

షూటింగ్ సెట్‌లో..
వకీల్ సాబ్ యూనిట్ తాజాగా యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ మీద రౌడీలు దాడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఫైటింగ్ సీన్స్‌లో పవన్ కళ్యాణ్‌కు గాయాలై.. రక్తాలు కారేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం లీకైన కొన్ని ఫోటోల్లో పవన్ కళ్యాణ్‌పై రక్తపు మరకలు కూడా ఉన్నాయి.
Recommended Video

గ్యాప్‌లో అలా..
అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే పుస్తకాలు చదువుతుంటాడని వేణు శ్రీరామ్ చెప్పిన సంగతి తెలిసిందే.అలా తాజాగా షాట్ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని పట్టుకుని తెగ చదివేస్తున్నాడు. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్అవుతోంది.


Click it and Unblock the Notifications











