Pawan Kalyan Review On Baramulla: బారాముల్లా మూవీపై పవన్ కళ్యాణ్ రివ్యూ

ధురంధర్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు ఆదిత్య ధర్. అంతకుముందే ఆయన పలు చిత్రాలను తీసినప్పటికీ ధురంధర్‌తో మారుమూల గ్రామాలకు ఆదిత్య చేరువయ్యారు. అయితే గతేడాది రిలీజైన బారాముల్లా సినిమాకు ఆయన కథను అందించారు. కాశ్మీర్ పండిట్లపై దారుణాలు, ఉగ్రవాదంపై వచ్చిన ఈ సినిమా మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ధురంధర్ 2, బారాముల్లా సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వివరాల్లోకి వెళితే..

జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై బారాముల్లా చిత్రాన్ని ఆదిత్య ధర్, లోకేష్ ధర్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా నిర్మించగా.. ఆదిత్య సుహాస్ జంభాలే దర్శకత్వం వహించారు. మానవ్ కౌల్, భాషా సుంబ్లి, అరిష్ట మెహతా, రోహన్ సింగ్, నీలోఫర్ హమీద్, మీర్ సర్కార్, ప్రియాంక్ తతారియా, సంజయ్ సూరి తదితరులు బారాముల్లాలో కీలకపాత్రలు పోషించారు. తీవ్రవాదం, కాశ్మీరీ పండిట్ల కుటుంబ కథలు, పోలీసుల దర్యాప్తులు, ఆత్మల అంశాలు వంటి ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన బారాముల్లా గతేడాది అక్టోబర్ 30న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

Pawan Kalyan Praises Baramulla Movie Shares Emotional Memories of Kashmir

ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, రాజకీయాలు, ఇటీవల వస్తున్న జాతీయవాద సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ధురంధర్ 2, బారాముల్లా సినిమాలు తనకు ఎంతో నచ్చాయని తెలిపారు. ధురంధర్ కథనం, దర్శకుడు చూపించిన విధానం, మేకింగ్ స్టైల్ చాలా బాగున్నాయి. రాజకీయ, పాలనాపరమైన బాధ్యతతలతో బిజీగా ఉండటం వల్ల ఇప్పటికీ ధురంధర్ రెండో భాగాన్ని చూడలేకపోయానని పవన్ అన్నారు.

ఇటీవల బారాముల్లా అనే సినిమా చూశా. స్వతహాగా నాకు హార్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. రాత్రుల్లు నిద్రపట్టని సమయంలో హారర్ చిత్రాలు చూస్తాను. మైండ్ పిచ్చి పిచ్చిగా ఉంటే.. ఈ తరహా సినిమాలు చూడటటం వల్ల నా మైండ్ సెట్ అవుతుంది. ఇలాంటి సమయంలోనే ఓ రోజున బారాముల్లా చూశా. ఈ సినిమాలో దర్శకుడు చూపించిన కాశ్మీర్, అక్కడి పరిస్ధితులు నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చాయి. 1987-89 ప్రాంతంలో శ్రీనగర్‌లో కొన్ని రోజులు గడిపా. ఆ సమయంలో కాశ్మీర్‌లో వాతావరణం చాలా భయంకరంగా, ఉద్రిక్తంగా ఉండేది. శ్రీనగర్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు స్థానికులు మమ్మల్ని చూసి హేళనగా మాట్లాడేవారు. అసలు మీరు ఎవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఆగ్రహం వ్యక్తం చేసేవారని పవన్ కళ్యాణ్ అన్నారు.

మా అన్నయ్య చిరంజీవి గారు సినిమా షూటింగ్స్‌ కోసం తరచుగా శ్రీనగర్ వచ్చేవారు. చాలా తెలుగు సినిమాలు ఇక్కడ షూటింగ్స్ జరుపుకునేవి. మా సొంత నిర్మాణంలోనూ రెండు సినిమాలు అక్కడ చిత్రీకరణ చేశాం. వాటికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించా. మేం సరుకులు ఏదైనా వస్తువులు కొనుక్కునేందుకు మార్కెట్‌కి వెళ్లినప్పుడల్లా స్థానికులు నానామాటలు అనేవారు. కాశ్మీర్ అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అంటారు, జగద్గురు ఆదిశంకరాచార్యుల ఆశ్రమం కూడా ఇక్కడే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

1989-90ల నాటికి కాశ్మీర్‌లో పరిస్ధితులు దారుణంగా తయారయ్యాయి. మా లైన్ ప్రొడ్యూసర్ ఒకరు.. ఇకపై మనం కాశ్మీర్ రావొద్దని అనేవారు. అయితే గెట్ అవుట్ అనే ఒక పదం మాత్రం నా మనసులో బలంగా తాకింది. ఎవరైనా గెట్ అవుట్ అంటే నాకు అస్సలు నచ్చదు. ఇలాంటి వ్యక్తిగత అనుభవాలు, తన మనసులో భావోద్వేగాల కారణంగా బారాముల్లా నాకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోని చాలా అంశాలు నన్ను ప్రభావితం చేశాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బారాముల్లా మరోసారి వార్తల్లో నిలిచింది.

Read more about: pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X