twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్దన్నయ్య పెద్ద మనసు.. ప్రతీ కార్మికుని శ్రమ తెలిసిన వ్యక్తి.. చిరంజీవిపై పవన్ ప్రశంసలు

    |

    కరోనా సమయంలో చిత్ర సీమ పూర్తిగా మూత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ కార్మికులు దిక్కులు చూస్తున్నారు. తమను ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న సినీ శ్రామికులను ఆదుకునేందు సినీ పెద్దలు ముందుకు వస్తున్నారు.

    చిరు భారీ విరాళం..

    సినిమా పరిశ్రమలోని పేద కళాకారులకు, టెక్నీషియన్లకు అండగా ఉండేందుకు చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. కరోనా లాంటి విపత్కర సమయంలో వారిని ఆదుకునేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించాలని కోరాడు. వివి వినాయక్ సైతం ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడు.

    గర్వపడుతున్నాను..

    గర్వపడుతున్నాను..

    సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ‘సినిమా పరిశ్రమకు ఎటువంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించే నా పెద్ద అన్నయ్య చిరంజీవి గారు సినీ కార్మికుల కోసం కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించినందుకు ఆయన తమ్ముడిగా గర్వపడుతున్నాను.

    ప్రతీ కార్మికుని శ్రమ..

    ప్రతీ కార్మికుని శ్రమ..

    సినిమా పరిశ్రమలోని 24 విభాగాలలోని ప్రతీ టెక్నీషియన్, ప్రతీ కార్మికుని శ్రమ తెలిసిన వ్యక్తి చిరంజీవి. కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి సినిమానే నమ్ముకుని జీవిస్తున్న ఎందరో కార్మికులు, టెక్నీషియన్లు ఆర్థికంగా అల్లాడిపోతున్నారు.

    Recommended Video

    Tollywood Star Heroes Huge Donation To Government | Prabhas | Pawan Kalyan | Ram Charan|Mahesh Babu
    ఆకలితో ఉన్నవారికి అన్నం..

    ఆకలితో ఉన్నవారికి అన్నం..

    అటువంటి వారిని ఆదుకోవడానికి పెద్దన్నగా ముందుకు వచ్చిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ద్ర హృదయానికి జేజేలు పలుకుతున్నాన'ని పేర్కొన్నాడు.

    English summary
    Pawan kalyan Praises Chiranjeevi Over Donating One Crore To Film Workers. He Says That He Will Feel Proud To Be His Brother.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X