Oscar Awards: ఆస్కార్ కమిటీలో కమల్ హాసన్‌.. పవన్ కళ్యాణ్ స్పందన ఇదే!

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు జీవితంలో ఒక్కసారైన అందుకోవాలనుకునే పురస్కారం ఆస్కార్ అవార్డ్స్. కానీ అందిరికీ ఆ అదృష్టం వరించదు.. ఏళ్లుగా ఈ పురస్కారం తమకు రాకపోతుందా అని ఎదురు చూసేవారెందరో. ఎవరికి తెలిసిన మార్గాల్లో వారు ఈ అవార్డ్‌ను ముద్దాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ రావడంతో భారతీయులు పొంగిపోయారు.

ఆర్ఆర్ఆర్ సంచలనం
ఆర్ఆర్ఆర్ కంటే ముందే భాను ఆతయ, రాహుల్ పుకుట్టి, సత్యజిత్ రే, గుల్జర్, ఏఆర్ రెహమాన్, కార్తీకి గోన్‌స్లావ్స్, గునీత్ మోంగా, వికాస్ సాతే, రాహుల్ తక్కర్ తదితరులు ఆస్కార్‌ను సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 24 విభాగాల్లోనూ ఆస్కార్స్ ఇస్తుండగా.. కొద్దిరోజుల క్రితం కొత్త కేటగిరీలను కూడా ప్రారంభించారు నిర్వాహకులు. 100వ అకాడమీ అవార్డుల వేడుకల్లో (2028) స్టంట్ డిజైన్ కేటగిరీలో అవార్డులను ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఫోటోలు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు పులితో ఫైట్ చేసే సీన్‌లోని ఓ షాట్‌ను ఆస్కార్ ఉపయోగించింది.

Pawan Kalyan Praises Kamal Hassan for Oscars Class Of 2025 Invitation

విజేతల ఎంపికకు కసరత్తు
ఇదిలాఉండగా.. ఈ ఆస్కార్ అవార్డ్స్‌కి నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచం నలుమూలల నుంచి ఆస్కార్స్ కోసం వచ్చే ఎంట్రీలను 24 విభాగాల్లో వడపోసి ది బెస్ట్ అనిపించిన వాటిని ఎంపిక చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి 15న జరిగే అవార్డుల వేడుకకు ఇప్పటి నుంచే వడపోత మొదలైంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డ్‌లకు ఎంపికకు సంబంధించి ఆస్కార్ అకాడమీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈవో బిల్ క్రామర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ కీలక ప్రకటన చేశారు.

ఆస్కార్ ఓటింగ్ సభ్యుడిగా కమల్
విజేతల ఎంపిక ఓటింగ్ కోసం అకాడమీ సభ్యులుగా చేరాలంటూ దేశ, విదేశాలకు చెందిన సినీతారలకు ఈ కమిటీ ఇన్విటేషన్ పంపింది. తాజాగా ఈ జాబితాను కమిటీ విడుదల చేసింది. వీరిలో ప్రపంచవ్యాప్తంగా 534 మంది నటీనటులు, సాంకేతిక దర్శకులకు స్థానం కల్పించింది. వీరిలో భారతీయ సెలబ్రెటీలకు కూడా చోటు దక్కింది. కోలీవుడ్ దిగ్గజం కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా, దర్శకురాలు పాయల్ కపాడియా, సినిమాటోగ్రాఫర్ రణబీర్ దాస్, క్యాస్టింగ్ డైరెక్టర్ కరణ్, ఫ్యాషన్ డిజైనర్ మ్యాక్సిమా బసు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ స్మృతీ ముంద్రాలకు కమిటీ ఆహ్వానం పంపింది.

కమల్‌కు పవన్ విషెస్
ఆస్కార్ అవార్డ్ విజేతల ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు హక్కు లభిస్తుంది. నామినేషన్ల స్టేజ్ నుంచి విజేతల వడపోత సహా ప్రతి ఒక్క అంశంలోనూ వీరంతా ఓటింగ్‌లో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. కాగా.. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న కమల్ హాసన్.. ఇప్పుడు ఆస్కార్ కమిటీలో స్థానం దక్కించుకోవడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను అభినందిస్తున్నారు. ఈ లిస్ట్‌లోకి సినీనటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కమల్ ఓ నటుడు మాత్రమే కాదని, కంప్లీట్ ఫిలిం మేకర్ అని ప్రశంసించారు. రచన, దర్శకత్వం, చిత్ర నిర్మాణం, పాటలు ఇలా ప్రతి అంశంపై ప్రశంసించారు. కమల్ హాసన్ ఆరు దశాబ్ధాల కెరీర్‌లో ఎన్నో కళాఖండాలను ఆవిష్కరించారని.. నటుడిగా, రైటర్‌గా దర్శకుడిగా భారతీయ సినిమాపై, ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan kamal hassan oscars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X