For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bhavadeeyudu Bhagat Singh: ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. చిరును గుర్తు చేసే పాత్రలో పవన్

  |

  కెరీర్ ఆరంభం నుంచీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చినా.. మధ్యలో రాజకీయాల కోసం సినీ రంగానికి గ్యాప్ ఇచ్చాడు టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో ఈ స్టార్ హీరో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పవన్ కల్యాణ్ ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకోవడంతో పాటు వాటిని పూర్తి చేస్తున్నాడు.

  Bigg Boss Non Stop: సరయు రాయ్‌పై చెక్కతో దాడి.. ఆరియానా తప్పుకు ఆమె బలి.. బిగ్ బాస్ వార్నింగ్

  ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాణా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేశాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన దీనికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకునేందుకు చాలా కష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు రాధే శ్యామ్ విడుదల వల్ల దీనికి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి.

   Pawan Kalyan Professor Role in Bhavadeeyudu Bhagat Singh

  పవన్ కల్యాణ్ ఇప్పటికే మొదలు పెట్టిన చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ చక్కవర్తుల కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ నెల చివరి నుంచి ఈ మూవీ షూట్‌లో పవన్ పాల్గొంటాడని, వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేస్తాడని అంటున్నారు. ఇక, ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌ 'భవదీయుడు భగత్‌ సింగ్' అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

  Akhanda 100 Days Collections: చరిత్ర సృష్టించిన బాలయ్య.. తెలుగులోనే తొలి సినిమాగా అఖండ రికార్డు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అంటున్నారు. అంతేకాదు, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యాయని తెలుస్తోంది. అలాగే, ఇందులో పవన్ కల్యాన్ చేయబోయే పాత్ర గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ముందు నుంచే ప్రచారం అవుతోన్నట్లు ఇందులో పవన్ ప్రొఫెసర్ పాత్రను చేస్తున్నాడట. 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి పాత్రను పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేశారని తెలుస్తోంది. ఒక ప్రొఫెసర్ సమాజాన్ని ఎలా మార్చాడన్న కథతో ఈ మూవీ రూపొందుతోందని సమాచారం.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'భవదీయుడు భగత్‌సింగ్' మూవీ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా సందేశాత్మకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఈ ఏడాది మధ్యలో ప్రారంభం కాబోతుందట.

  English summary
  Pawan Kalyan Announced Bhavadeeyudu Bhagat Singh Movie with director Harish Shankar. Pawan Kalyan to do Professor Role in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X