twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధర్మాన్ని పరిరక్షిద్దాం–మతసామరస్యాన్ని కాపాడుకుందాం.. దీపాలు వెలిగించిన పవన్ కళ్యాణ్

    |

    దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు నేడు పవన్ కళ్యాణ్ దీపారాధాన కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జరిగిన అగ్నిప్రమాదంపై అందరూ భగ్గుమన్నారు. ఆ ప్రమాదంలో 62 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి రథం అగ్నికి ఆహుతవడం కలకలం రేపింది.

    దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతనధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు. 1893,11 సెప్టెంబర్...స్వామి వివేకానంద వారు చికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో- మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజు. ఇదే రోజు మనం 'ధర్మాన్ని పరిరక్షిద్దాం - మతసామరస్యాన్ని కాపాడుకుందాం' అనే చిత్తంతో దీపాలు వెలిగిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.

     Pawan Kalyan Programme About Protecting Sanatana Dharma

    ఇక పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు జనసేన కార్యకర్తలు, అభిమానులు కదిలారు. తమ తమ ఇంట్లోనే దీపాలు వెలిగించి మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మెగా ఇంట్లో సురేఖ దీపాలు వెలిగించగా.. వాటిని రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ తన ఫాంహౌస్‌లోనే దీపాలు వెలిగించి ధర్మాన్ని పరిరక్షిద్దాం-మతసామరస్యాన్ని కాపాడుకుందాం అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశాడు.

    English summary
    Pawan Kalyan Programme About Protecting Sanatana Dharma, Pawan Kalyan Given Call To Lighted Diya To Show Sanatana Dharma Importance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X