PSPK Rana మూవీ నుంచి సీన్ లీక్.. పవన్ తో రానా ఢీ...రచ్చ రేపుతున్న వీడియో!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

వకీల్ సాబ్ రీ ఎంట్రీ
ఇక రాజకీయాలు తప్ప సినిమాలు చేయనని చెప్పి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టారు. అలా రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన వకీల్ సాబ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల టికెట్ రేట్లు విషయంలో సందిగ్ధత కొనసాగుతుండగానే ఓ ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించలేదు.

సూపర్ హిట్ రీమేక్
ఆ సంగతి పక్కన పెడితే ఆయన వకీల్ సాబ్ సినిమా చేస్తున్నప్పుడే అనేక సినిమాలు ఒప్పుకున్నారు. ఆ సినిమాలో ఒకటే ఈ మలయాళ సినిమా రీమేక్ అయ్యప్పనుమ్ కోషియం. మలయాళంలో బిజు మీనన్ పృద్వి రాజ్ సుకుమారన్ నటించిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బిజు మీనన్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా నటిస్తున్నారు.

భారీ అంచనాలు
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమాకు మాటలు స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ అంచనాలను రెట్టింపు చేసేలా ఇటీవలే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో ఉన్న భీమ్లా నాయక్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ దానికి సంబంధించిన ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.

భీమ్లా నాయక్ క్రేజ్
అయితే ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ లోకేషన్ నుండి లీక్ అయిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ రానాను అరెస్ట్ చేస్తున్న దాదాపు 30 సెకండ్ల నిడివిగల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సీన్ చూస్తున్న అందరికీ గూజ్ బంప్స్ తెప్పిస్తోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

పవన్ కళ్యాణ్ రానా సీన్స్ ఒక రేంజ్ లో
పవన్ కళ్యాణ్ రానా మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతలా జనాన్ని ఆకట్టుకునే బోతున్నాయి అనడానికి ఇది శాంపిల్ మాత్రమే అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని మాత్రం లీకైన వీడియో ద్వారా క్లారిటీ వస్తుంది. నిజానికి ఇలా లీకైన వీడియోలు సినిమా మీద ఆసక్తి తగ్గిస్తాయని భావిస్తూ ఉంటారు. కానీ పవన్ విషయంలో ఈ సినిమా లీకేజీలే ఆయనకు పెద్ద అసెట్ గా మారుతూ ఉంటాయి.

సెంటిమెంట్
గతంలో కూడా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా అయితే చాలా వరకు ఆన్లైన్ లో లీక్ అయింది కానీ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది..పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఇలా లీకుల గురించి ఒక బాధ పడుతూనే మరోపక్క తన సెంటిమెంట్ను గుర్తుతెచ్చుకుంటూ కచ్చితంగా ఈ సినిమా కూడా అనేక రికార్డులు బద్దలు కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వీడియో మాత్రం ఆసక్తికరంగా సాగింది అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











