నా జీవితంలో అప్పుడు తొలి ప్రేమ విజయం.. ఇప్పుడు ఈ గెలుపు.. పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంతోపాటు ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన మరో 20 మందిని విజయం వరించింది. అయితే తనకు తిరుగలేని విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

నా జీవితంలో ఇప్పటి వరకు విజయం తెలియదు. ఎప్పుడో సినిమాల్లో ఉన్నప్పుడు తొలిప్రేమ సినిమా విజయాన్ని అందించింది. నా జీవితమంతా దెబ్బలు తినడం, మాటలు, అవమానాలు పడటమే జరిగింది అని అన్నారు.

Pawan Kalyan recollected Tholiprema movie Success after Jana Sena win in AP Elections

పరాజయాన్ని చూసి భయపడను. ఓటమి నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. దేనికంటే.. చిన్నప్పుడు ధర్మో రక్షిత రక్షితహా: అని నేర్చుకొన్నాను. ధర్మం కోసం నిలబడితే.. ధర్మ మనకోసం నిలబడింది. కనిపించని పరాశక్తి, దేవుళ్లకు, పిఠాపురం ప్రజలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. కదం తొక్కిన యువతకు, ఆడబిడ్డలకు, తెలుగు దేశం నేతలకు, నాయకులకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని అన్నారు.

పిఠాపురంలో గెలిపించి మరింత బలం ఇచ్చారు. ఓడిపోతే బలంగా నిలబడ్డాను. ఆకాశమంతా ధైర్యం అందించారు. మీ ప్రేమను గుండెల్లో పెట్టుకొంటాను. మీ కష్టాల్లో ఒకడిని అవుతాను. మీ ఇంట్లో ఒక్కడిగా ఉంటాను. మీ కోసం, మీ శ్రేయస్సు కోసం అసెంబ్లీలో అడుగుపెడుతున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X