కేటీఆర్‌లో అలాంటి ఆత్మీయత.. థాంక్స్ చెబుతూ పవన్ కల్యాణ్ లేఖ!
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే.. ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి కేటిఆర్ ముఖ్యఅతిధిగా హజరై అందరిని అకట్టుకున్నారు. ఆయన హాజరు కావడం కొత్త ఏమీ కాకున్నా పవన్ వేడుకకు తొలిసారి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని సందర్బాల్లో సీఎం కేసిఆర్‌ను వ్యతిరేకించి కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కు ఆయన వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో పవన్ ఆయనకు థాంక్స్ చెబుతూ ఒక లేఖ విడుదల చేసింది.

విపరీతంగా ఆకట్టుకుంది
వేడుకకు హాజరు కావడమే కాక వేడుక జరిగినంత సేపు పవన్ కళ్యాణ్‌తో ఏదో ఒకటి మంత్రి కేటిఆర్ మాట్లాడుతూనే ఉన్నారు. ఇద్దరూ కలిసి స్టేజిపైకి వెళ్లి డ్రమ్స్ వాయించారు. ఓవైపు పవన్ కళ్యాన్ వైపు మంత్రి కేటిఆర్, మ్యూజిక్ డైరక్టర్ తమన్‌తో పాటు శివమణిలు వాయించడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

నిండు హృదయంతో
సాధారణంగా ఇలాంటి ఈవెంట్‌లకు చాలా తక్కువగా వెళ్లే మంత్రి కేటిఆర్ నేరుగా స్టేజి పైకి వెళ్లి సంతోషంగా వాయించడం అందరినీ ఆకర్షించింది. దీనికి తోడు ఆయన ఈ విషయం మీద ట్వీట్ కూడా చేశారు. నిత్యం రాజకీయా కార్యక్రమాలతో బీజిగా ఉండే తనకు ఈ ఈవెంట్‌లో పాల్గోనడం వలన కాస్త విరామం లభించందని అన్నారు. దీంతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహిత మొగిలయ్యతో పాటు సంగీత దర్శకులు ఇతరులను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.

నిండు హృదయంతో
ఆయన అలా అంటే మరో పక్క తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి ప్రాంతీయ, భాష, కుల, మత బేధాలు ఉండవు. భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోసారి తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండు హృదయంతో మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను'' అంటూ పేర్కొన్నారు.

అంటనీయకపోవడం
ఫిబ్రవరి 24న బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో బిల్ గేట్స్ తో కీలకమైన వర్చువల్ మీట్ కు సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నా. సమయం వెసులుబాటు చేసుకొని భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారని అన్నారు. ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉందని అన్నారు.
Recommended Video

హృదయపూర్వక కృతజ్ఞతలు
ప్రస్తుత హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ప్రతి ఏటా నిర్వహించే ఆలయ బలయ్ కార్యక్రమంలో అన్ని పక్షాల వారు ఆత్మీయంగా ఉండటాన్ని చూస్తాం. అటువంటి ఆత్మీయత కె.టి.ఆర్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సృజనాత్మకం, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రంగం అభివృద్ధికి ఆలోచనలు కె.టి.ఆర్ చిత్తశుద్ధితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని పవన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











