For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్కడి వరకో ఈ ‘గమనం’.. ఎమోషనల్‌గా టచ్ చేసిన శ్రియ

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా గమనం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. పోస్టర్లతో సినిమాపై హైప్ పెంచింది గమనం టీం. శ్రియా, నిత్యా మీనన్, ప్రియాంక జవాలక్కర్ వంటి తారల పోస్టర్లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా పవన్ రిలీజ్ చేసిన గమనం ట్రైలర్ కూడా ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ ట్రైలర్‌లో శ్రియానే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

    చెవిటి పాత్రలో శ్రియ అదరగొట్టేసింది. ఎమోషన్స్ హవభావాల విషయంలో శ్రియా అదరగొట్టేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం ఏంటో అర్థమవుతోంది. ఎవరి గురించి సినిమా చెబుతున్నాడు.. అందులో ఎవరెవరి కథలు ఎలా ఉండబోతోన్నాయనే హింట్ ఇచ్చేశాడు. ఈ ఫార్మూలాతో వచ్చిన వేదం సినిమా బాగానే క్లిక్ అయింది. ఐదారు కథలను ఒకేసారి చూపించడం ఒక్కో కథలో ఒక్కో సమస్యను తెరపై చూపెట్టం బాగానే ఉంది.

    'ఆ మబ్బులు చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కడి వరకూ వెళతాయో వాటికే తెలియదు. అలా వెళ్తూ వెళ్తూ వానై కరిగిపోతాయ్‌. ఒకటి వానైతే.. ఇంకొకటి ఒంటరిదైపోతుంది' అని ప్రియాంక జవాల్కర్‌ చెప్పిన డైలాగ్‌లో వారి కథ ఎలా ముగుస్తుందో చెప్పనకే చెప్పేశారు. 'నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా.

    Pawan Kalyan Released Gamanam Trailer

    నీకూ వినపడదని నాకేం తెలుసు' అని వరదల్లో మునిగిపోతోన్న శ్రియ చెప్పడం, హ్యాపీ బర్త్ డే అంటే ఏంటని ఓ ఇద్దరు చిన్న పిల్లలు మాట్లాడుకోవడం, మనకు అలాంటివి ఉండవా? అని అడగడం ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్‌ గమనంలో ఉన్నాయి. మొత్తానికి ఈ అందరి గమనం ఎక్కడి వరకు చేరుకుంటుంది.. ఎలా ముగుస్తుందన్నదే కథ. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Pawan Kalyan Released Gamanam Trailer, Shriya Saran, Nitya Menon, Priyanka Jawalkar, Suhas In Gamanam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X