‘ఉస్తాద్' కోసం పవన్ కళ్యాణ్‌కు ఊహించని రెమ్యూనరేషన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Pawan Kalyan Remuneration: పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh)'. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న గ్రాండ్ వర్డల్ వైడ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ట్రైలర్, టీజర్, గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్‌పై నిర్మాత నవీన్ యేర్నేనీ (మైత్రి నవీన్) క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే.?

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం తీసుకున్న పారితోషికంపై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోలు రూ.50 కోట్లకు పైగా తీసుకుంటున్న సమయంలో, పవన్ మాత్రం ఈ సినిమాకు సుమారు రూ.25 కోట్లే తీసుకున్నట్లు టాక్. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇప్పటికే గతంలోనే రూ.5 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాడని టాక్.

Pawan Kalyan Remuneration for Ustaad Bhagat Singh Revealed by Producer Naveen

పవన్ కళ్యాణ్ ఈ తక్కువ రెమ్యునరేషన్‌తో పాటు సినిమా లాభాల్లో శాతం తీసుకునే ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ రాజకీయాల కారణంగా పలుమార్లు డిలే అయినప్పటికీ, నిర్మాతలకు సపోర్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యేర్నేనీ (మైత్రి నవీన్) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన నవీన్.. పవన్ కళ్యాణ్ గురించి ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు.'పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మా దగ్గర నుంచి కేవలం ఒక చిన్న అడ్వాన్స్ తప్ప ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు' అని తెలిపారు.

సినిమా డిలే అయిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఎంతో అండగా నిలిచారని చెప్పారు. 'సినిమా కంఫర్టబుల్‌గా ఉంటేనే చేయండి... లేదంటే నేను మీకు సపోర్ట్‌గా ఉంటాను అని ఆయన చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఇది విన్నవారు నమ్మరు కూడా' అని అన్నారు.

ఇంక నవీన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కేవలం సినిమా పరంగా మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా తమకు సపోర్ట్ ఇచ్చారని వెల్లడించారు. 'నేను పొలిటికల్‌గా కూడా మీకు సపోర్ట్ చేస్తాను. ఎక్కడా ఆగకుండా మూడు నెలలు మీ సినిమా కోసం షూటింగ్ చేస్తాను అని ఆయన క్లారిటీ ఇచ్చారు' అని చెప్పారు. అంతేకాకుండా, తనకు ఇతర పనులు ఉన్నప్పటికీ, వీలైనప్పుడల్లా షూటింగ్‌కు వచ్చి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సినిమా కోసం పవన్ కళ్యాణ్ చేసిన కృషిని నవీన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఈ సినిమాలో తన లుక్ కోసం పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఎంతో డెడికేషన్‌తో పని చేశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ పారితోషకం తీసుకోకుండా సినిమా కోసం అంకితభావంతో పనిచేయడం, అలాగే నిర్మాతలకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X