Pawan Kalyan Remuneration: పవన్ కళ్యాణ్‌కు రికార్డ్ రెమ్యునరేషన్.. హరిహర వీరమల్లుకు ఎన్ని కోట్లంటే?
ఐదేళ్ల పాటు ఎన్నో అడ్డంకులను దాటుకుని, ఎన్నో సమస్యలను అధిగమించి జూలై 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది హరిహర వీరమల్లు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు నటించారు.
ఇంకా ఈ చిత్రంలో సత్యరాజ్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించగా.. వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో హరిహర వీరమల్లుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ పారితోషికం ఎంత? ఎన్ని కోట్లు ఉండొచ్చు? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఐదేళ్ల క్రితం సెట్స్ మీదకి
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చెప్పిన కథ నచ్చడంతో పవన్ కళ్యాణ్ వెంటనే హరిహర వీరమల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు రీమేక్స్, ఇతర మాస్ ఎంటర్‌టైనర్లు చేసుకుంటూ వచ్చిన పవన్ తొలిసారిగా ఓ హిస్టారికల్ రోల్‌లో, అది కూడా ఓ పీరియాడిక్ మూవీ చేస్తుండటంతో చాలా ఎగ్జయిట్ అయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం అట్టహాసంగా సెట్స్ మీదకి వెళ్లింది హరిహర వీరమల్లు. అయితే కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసింది చిత్ర యూనిట్. కోవిడ్ తగ్గుముఖం పట్టి దేశంలో తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొన్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభించారు.
ఏపీ రాజకీయాల్లో పవన్ బిజీ
పవన్ కళ్యాణ్ సైతం ఎంతో ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొన్నారు. బ్లాక్‌డ్రెస్‌లో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న పవన్ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అంతా సవ్యంగా సాగుతున్న దశలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు రావడంతోపాటు, ఏడాది ముందు నుంచే వారాహి యాత్ర, జనవాణి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. దీంతో వీరమల్లు షూటింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. షూటింగ్‌లో జరుగుతున్న జాప్యంతో పాటు వ్యక్తిగత కారణాలతో క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టుకున్నారు.
రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన పవన్
తన కారణంగా సినిమా ఆలస్యం అవుతుండటం, నిర్మాతపై ఆర్ధిక భారం పెరిగిపోతుండటంతో పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఈ సినిమాకు తాను అడ్వాన్స్ కింద తీసుకున్న రూ.11 కోట్ల పారితోషికాన్ని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చి.. ఏఎం రత్నాన్ని ఆదుకున్నారు. తానెప్పుడూ నిర్మాతలు బాగుండాలని కోరుకుంటానని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. అయితే అసలు హరిహర వీరమల్లుకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
నిర్మాత క్షేమమే నాకు ముఖ్యం
బ్రో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుని ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచిన పవన్ కళ్యాణ్.. వీరమల్లుకు ఇంకెంత తీసుకుంటాడో అనుకున్నారు. అయితే హరిహర వీరమల్లు చిత్రం హిట్ అయితేనే పారితోషికాన్ని తీసుకుంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు. వీరమల్లు ప్రమోషన్స్ కార్యక్రమంలో పవన్‌ను రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. నిర్మాతను కాపాడాలన్నదే నా మొదటి లక్ష్యం.. హరిహర వీరమల్లు కోసం ఒక్క పైసా కూడా తీసుకోలేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
నాకు చాలా సినిమాలకు రావాల్సిన బకాయిలు ఎంతో ఉన్నాయని.. కానీ కొన్ని సినిమాలు సరిగా ఆడకపోవడంతో తాను అడగలేకపోయానని చెప్పారు. ఇప్పుడు హరిహర వీరమల్లు బాగా ఆడితే రెమ్యునరేషన్ గురించి ఆలోచిస్తానని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. హరిహర వీరమల్లు కనుక కలెక్షన్ల వర్షం కురిపిస్తే పవన్ కళ్యాణ్‌కు రికార్డ్ స్థాయిలో పారితోషికం దక్కవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పవన్ మంచి మనసును అభిమానులు మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











