For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pawan Kalyan : మా ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడతారా..? కానీ నేను మాటిస్తా.. ఆ భయం నేర్పిస్తా!

  |

  రెండు తెలుగు రాష్ట్రాల సినిమా, రాజకీయ రంగాలు అన్నీ కూడా పవన్ కామెంట్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఆయన మీద ఎక్కువగా టార్గెట్ చేశారు ఏపీ మంత్రులు. ఆ సంగతి పక్కన పెడితే పోసాని నిన్న పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక ఈరోజు ఏపీ పర్యటనకు వెళ్లిన పవన్ మీడియా సమావేశంలో పోసాని చేసిన కామెంట్స్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  కుక్కలే

  కుక్కలే

  గ్రామ సింహాలంటూ ఇటీవల చేసిన ట్వీటుతో ప్రసంగం మొదలు పెట్టిన పవన్, ఘోంకరాము అంటే మొరుగడం అని గ్రామ సింహం అంటే కుక్కలు, వీధి కుక్కలు అని చెప్పుకొచ్చారు. శంకర్ నారాయణ డిక్షనరీ ప్రకారం పిచ్చి కుక్కలు, ఊర కుక్కలని. ఎక్కువగా వాగి పళ్లు రాళ్లు కొట్టించుకునే కుక్కలని పేర్కొన్నారు. ఈ సన్నాసులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పించలేని సంస్కారాన్ని మేం నేర్పిస్తాం, ఇంకా నూనూగు మీసాలు కూడా రాని కుర్రాళ్లు సంస్కారం నేర్పిస్తారని అన్నారు.

  ఆ భయం నేర్పిస్తా

  ఆ భయం నేర్పిస్తా

  ఇక వైసీపీ నేతలకు మదం, మత్స్యారం అన్ని ఉన్నాయి.. లేనిదల్లా భయం మాత్రమేనని వైసీపీ నేతలకు ఆ భయం నేర్పిస్తామని అన్నారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులాల ముసుగులో దాక్కుంటున్నారన్న పవన్, నాకూ బూతులు వచ్చు.. గుంటూరు, బాపట్ల, పిడుగు రాళ్లలో తిరిగిన వాడినేనని అన్నారు. జగన్ బాబాయిను ఎవరు చంపారు..? కోడి కత్తి గురించి కేసు ఏమైందంటే వ్యక్తిగతంగా మాట్లాడారని, వైసీపీ నేతలది నాకంటే రంగుల జీవితమని అన్నారు.

  ఆడవాళ్ల గురించి మాట్లాడము

  ఆడవాళ్ల గురించి మాట్లాడము

  ఇక నాపై వైసీపీ అధినేత కూడా వ్యక్తిగత కామెంట్లు చేశారని పేర్కొన్న పవన్ నిన్నటి పోసాని విషయం గురించి నేరుగా స్పందించకపోయినా నేను కానీ.. మా కార్యకర్తలు కానీ వైసీపీ నేతల ఇళ్లల్లోని ఆడవాళ్ల గురించి మాట్లాడమని అనరు. మాట తప్పను.. మడమ తిప్పను అని నేను మాటలు చెప్పను.. చేసి చూపిస్తానని అన్నారు. ఇక వైసీపీ నేతలు ఎలాంటి యుద్దాన్ని కోరుకుంటున్నారు..? ప్రజాస్వామ్య పద్దతిలో కావాలా..? వేరే విధంగా కావాలా..? దేనికైనా మేం సిద్ధం అన్నారు.

  మా నాన్న, మా మామ సీఎం కాదు

  మా నాన్న, మా మామ సీఎం కాదు

  ఇక మా నాన్న సీఎం కాదు.. మా మామ సీఎం కాదన్న పవన్, మా నాన్న నాకు ఇడుపులపాయ లాంటి ఎస్టేట్ ఇవ్వలేదని, కానీ సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం ఉందని అన్నారు. యోగ మార్గంలో వెళ్ళిన నన్ను.. బాధ్యతలు తప్పించుకుంటున్నావని అంటే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాల్లోకి వచ్చాను కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చానని అన్నారు. ఇక పొలంలో కలుపు మొక్కలను పీకినట్టు.. రాజకీయాల్లో కలుపు మొక్కలను పీకేస్తానని పవన్ పేర్కొన్నారు.

  Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
  మా ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడతారా..?

  మా ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడతారా..?

  వైసీపీ కిరాయి మూకలకు భయపడనన్న పవన్, ప్రభుత్వానికి అన్ని రకాలుగా కలిపి లక్ష కోట్ల ఆదాయం వస్తుంది కానీ రిటైర్డ్ ఎంప్లాయీసుకు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని, చనిపోయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. లంచం ఇస్తామన్నా.. మా దగ్గర డబ్బుల్లేవ్ ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోందని, సమస్యలని ప్రస్తావిస్తే.. మా ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడతారా..? అంటూ ఆయన ప్రశ్నించారు. డబ్బుల్లేకుంటే పస్తులు ఉంటాను కానీ.. చేయి చాచనన్న పవన్ పార్టీ కార్యాలయాన్ని కూడా నా బిడ్డల గురించి దాచుకున్న డబ్బుతో కొన్నానని అన్నారు.

  English summary
  Pawan Kalyan Responds to posani krishna murali comments about his family. తన కుటుంబం గురించి పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X